యాదగిరిగుట్ట, ఏప్రిల్ 22 :యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం శనివారం భక్తులతో సందడిగా మారింది. సెలవుదినం కావడంతో స్వయంభూ నారసింహుడి ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, తిరు మాఢవీధులు, గర్భాలయాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం శనివారం భక్తులతో సందడిగా మారింది. సెలవుదినం కావడంతో స్వయంభూ నారసింహుడియ ముఖ మండపంలోని క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల సందడిగా మారాయి. కొండపైకి వాహనాల రద్దీ కొనసాగింది. తెల్లవారుజాము నుంచే స్వయంభూ నారసింహుడిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. నిత్య తిరుకల్యాణోత్సవం, సువర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనంలో భక్తులు పాల్గొన్నారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరు కల్యాణోత్సవం అత్యంత వైభవంగా సాగింది. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు.
సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. స్వామివారి ధర్మదర్శానికి 3 గంటలు, వీఐపీ దర్శనానికి 2 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. సుమారు 36 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి స్వామివారి ఖజానాకు రూ.39,98,455 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు. లక్ష్మీనరసింహుడిని రాష్ట్ర ఏసీబీ జేడీ సుదీంద్ర సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఆలయ సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం వారికి అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారి రాజు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.