తుంగతుర్తి, మార్చి 26 : తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన TGCET–2026 ప్రవేశ పరీక్ష ఫలితాల్లో తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరి వెంకట్రామనరసమ్మ మాట్లాడుతూ.. వెంపటి పాఠశాల నుండి మొత్తం 35 మంది విద్యార్థులు పరీక్ష రాయగా అందులో 28 మంది విద్యార్థులు అర్హత సాధించి సీట్లు పొందారని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల సహకారం కలిసి సాధించిన విజయం సాధించామన్నారు.
ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులకు పునాది స్థాయి నుంచే సరైన మార్గదర్శనం, సాధన, పరీక్షలపై అవగాహన కల్పించడం ద్వారా ఈ ఫలితాలు సాధించగలిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీవనపల్లి శ్రీనివాస్, మల్లెపాక రవీందర్, గట్టు మాధవి, నిమ్మరబోయిన నవీన, బండారు భవాని, జీడి అనిల్ కుమార్, మిట్టగడుపుల విక్రమ్, మాలోతు కృష్ణ, గుండ్ల ఆంజనేయులు, రామణబోయిన మౌనిక, అబ్బగాని మంజుల, శీలోజు రమాదేవి పాల్గొన్నారు.