తిరుమలగిరి, ఆగస్టు 30 : తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్కు మూడు రోజుల నుంచి పెసర్లు పెద్దఎత్తున వస్తున్నాయి. ఈ నెల 28 నుంచి పెసర్ల రాక ప్రారంభం కాగా 1,788 క్వింటాళ్లు వచ్చాయి. ప్రారంభంలో క్వింటాకు రూ. 8,029 ధర రాగా గురువారం రికార్డు స్థాయిలో క్వింటా రూ.8,500 పలికింది. సీజన్ ఇప్పుడే ప్రారంభం కావడంతో ఇక ముందు మరింతగా పెసర్ల మార్కెట్కు పోటెత్తే అవకాశం ఉందని మార్కెట్ సెక్రటరీ శ్రీధర్ తెలిపారు.
బొడ్రాయిబజార్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్కు వారం రోజులుగా పెసర్లు వస్తుండగా శుక్రవారం 132మంది రైతులు 513 క్వింటాళ్ల పెసర్లు తీసుకొచ్చారు. మార్కెట్లో క్వింటా పెసర రూ 8,299 ధర పలికింది. అలాగే ఇద్దరు రైతులు తీసుకొచ్చిన రెండు క్వింటాళ్ల కంది క్వింటాకు రూ. 7,695 ధర పలికింది. పెసర్లకు అధిక ధర రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మార్కెట్ సెక్రటరీ రాహుల్ ఎప్పటికప్పుడు ధాన్యం నాణ్యతను పరిశీలిస్తూ మంచి ధర వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.