మునుగోడు, జూలై 27 : సమైక్య పాలనలో కనీస వసతులు లేక అల్లాడిన పల్లెలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రమేర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వంలో సకల సౌకర్యాలతో కళకళలాడుతున్నాయి. ఈ యేడాది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో ముందంజలో నిలిచేందుకు సన్నద్ధమవుతున్నాయి. త్వరలో కేంద్ర బృందాలు పర్యటించి అవార్డులకు ఎంపిక చేయనున్నాయి.
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ పోటీల్లో పాల్గొనేందుకు నల్లగొండ జిల్లా నుంచి 15గ్రామాలు జనాభా ప్రకారం ఎంపిక చేశారు. జిల్లాలో మొదటి కేటగిరీ 2వేల లోపు, రెండో కేటగిరీ 2 నుంచి 5వేలు, మూదో దశలో 5వేలకు పైగా జనాభా ఉన్న వాటిని ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపారు. 2021లో జాతీయ స్థాయిలో నల్లగొండ జిల్లాకు 33వ ర్యాంకు దక్కింది. జిల్లాలో 844 గ్రామపంచాయతీలు ఉండగా జిల్లాస్థాయిలో ఒక్కో కేటగిరీలో 5 చొప్పున ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొత్తం 15 గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి నామినేట్ చేశారు.
పోటీల్లో పాల్గొనేందుకు ఆయా గ్రామాల్లో పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. గ్రామాల్లో మల వ్యర్థాల నిర్వహణ, తడి పొడి చెత్త, వృథా నీటి నిర్వహణ, సురిక్షత మల వ్యర్థాల నిర్వహించడం స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవగాహన చిత్రాలు, గ్రామస్థాయి నీరు, పారిశుధ్య కమిటీ నిర్వహణ, ఉపయోగంలో ఉన్న పారిశుధ్య సౌకర్యాలు, ఇండ్లలో తక్కువ చెత్త కలిగి ఉండడం, పరిసరాల పరిశుభ్రత, ఇంకుడు గుంతులను వినియోగించడం వంటి అంశాల ఆధారంగా కేంద్ర బృందాలు నిర్దేశించిన మార్కుల ఆధారంగా నివేదిక సమర్పించనున్నాయి. కార్యక్రమంపై పల్లెల్లో అవగాహన కల్పించేందుకు ఎంపీడీఓలకు బాధ్యత అప్పగించారు. ఇందుకు ప్రత్యేక అధికారులను నియమించారు.
మిర్యాలగూడెం పరిధిలోని శ్రీనివాస్‌నగర్, మునుగోడు మండలంలోని జక్కలవారిగూడెం, గుండ్లపల్లి పరిధిలోని శ్రీనగర్పల్లి, దామచర్ల పరిధిలో రాజాగట్టు, మర్రిగూడం పరిధిలోని తమ్మడపల్లి, 2వేలకు పైగా జనాభా ఉన్న గ్రామాలు మర్రిగూడం మండలం వట్టిపల్లి, దామరచర్ల మండలం వాడపల్లి, నల్లగొండ మండలం అప్పాజిపేట, చిట్యాల మండలం ఉరుమడ్ల, గుర్రంపోడు మండలంలోని పోచంపల్లి గ్రామం.
నాంపల్లి, కేతేపల్లి, నిడమనూరు, అడవిదేవులపల్లి, ము నుగోడు. అధికారుల పర్యవేక్షణ స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో ఉన్న గ్రామాలను కేంద్ర బృందాలు పర్యటించనున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా గ్రామాల్లో జిల్లా స్థాయి అధికారులు పర్యటనలు పూర్తయ్యాయి. కేంద్ర బృందాలు నమోదు చేసుకునే అంశాలన్నింటిని క్షేత్రస్థాయిలో పూర్తి చేశారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి మార్కులు వేసుకుని అవార్డుల జాబితాకు అధికారులు పంపనున్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారాలను పంచాయతీలకు ఇవ్వాలని తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మా మండలం నుంచి కనీ సం ఒకటైన రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపికవుతాయన్న నమ్మకం ఉంది. ఇందుకోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఎంపిక చేసిన గ్రామాల్లో అధికారులు పర్యటించి పంచాయతీ సభ్యులకు, ప్రజలకు, విద్యార్థులకు పరిశుభ్రతకు తీసుకోవాల్సిన చర్యలు గురించి అవగాహన కల్పిస్తున్నాం.
– ఆర్.భాస్కర్, ఎంపీడీఓ, మునుగోడు