చౌటుప్పల్ రూరల్, జనవరి12 : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు పయనమయ్యారు. దాంతో 65వ జాతీయ రహదారిపై రద్దీ నెలకొన్నది. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో బుధవారం వాహనాలు బారులుతీరాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద కూడా స్పల్పంగా రద్దీ కనిపించింది. ఫాస్టాగ్ ఉండడంతో వాహనాలు సాఫీగా వెళ్తున్నాయి.
టోల్ ప్లాజా వద్ద 16 కౌంటర్లు ఉండగా అందులో విజయవాడ వైపు 10 కేంద్రాలను తెరిచారు. ప్రతి నిత్యం ఈ రహదారి వెంబడి 30వేల వాహనాలు వెళ్లుతుంటాయి. పండుగ సందర్భంగా మరో 10 వేల వాహనాలు పెరిగే అవకాశం ఉన్నది. శుక్రవారం మరింత రద్దీ పెరుగనుండగా ఆ మేరకు విజయవాడవైపు కౌంటర్లను పెంచనున్నారు.