కష్టాలు తీర్చంగా.. సాగు సంతోషంగా
సూర్యాపేట మండలంలోని సింగిరెడ్డి పాలెం, తాళ్లఖమ్మంపహాడ్ గ్రామాలకు మూసీ 36వ డిస్ట్రిబ్యూటరీ కాల్వకు అనుసంధానంగా మైనర్ కాల్వ ఉన్నది. గతంలో కాల్వ మీదుగా రోడ్డును వేసే క్రమంలో గూనల లెవల్‌ను కాంట్రాక్టర్లు సరిచూసుకోలేదు.
- మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవతో తీరిన సింగిరెడ్డి పాలెం, తాళ్లఖమ్మంపహాడ్ రైతుల ఇబ్బందులు
- 24 గంటల్లో మూసీ 36 డిస్ట్రిబ్యూటర్ కాల్వ మరమ్మతు పనులు
- ఎండిపోతున్న పంటలకు ప్రాణం..
- అన్నదాతల్లో ఆనందం
సూర్యాపేట మండలంలోని సింగిరెడ్డి పాలెం, తాళ్లఖమ్మంపహాడ్ గ్రామాలకు మూసీ 36వ డిస్ట్రిబ్యూటరీ కాల్వకు అనుసంధానంగా మైనర్ కాల్వ ఉన్నది. గతంలో కాల్వ మీదుగా రోడ్డును వేసే క్రమంలో గూనల లెవల్‌ను కాంట్రాక్టర్లు సరిచూసుకోలేదు. దాంతో కాల్వలోకి నీళ్లు రాక సుమారు 150 ఎకరాలపైనే పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. రైతులు ఈ సమస్యపై మంత్రికి రెండు రోజుల క్రితం వాట్సాప్‌లో పోస్ట్ చేయగా వెంటనే స్పందించి కాల్వ మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. 24 గంటల్లో పునరుద్ధరించడంతో కాల్వలోకి నీళ్లు పారుతున్నాయి. తమ కష్టాలు తీర్చిన మంత్రికి రైతులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
సూర్యాపేట రూరల్, మార్చి 14 : రైతుల కష్టాలు రైతులకే తెలుసంటారు. రాష్ట్ర మంత్రి హోదాలో ఉండి స్వతహగా వ్యవసాయాన్ని ఇష్టపడే సూర్యాపేట శాసనసభ్యుడు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కష్ట కాలంలో తోటి రైతులకు ఆసరాగా నిలిచి వారి కళ్లలో ఆనందం నింపారు. మంత్రి చొరవతో ఎండిపోతున్న వందల ఎకరాల పంట పొలాలు తిరిగి జీవం పోసుకున్నాయి. మూసీ ప్రాజెక్ట్ ప్రధాన కాల్వ సింగిరెడ్డిపాలెం-తాళ్లకాంపాడ్ గ్రామ రైతుల భూములకు వెళ్లే 36వ డిస్ట్రిబ్యూటరికి సంబంధించిన కాల్వకు అనుసంధానంగా మరో మైనర్ కాల్వ ఉంది. అయితే కొంతకాలం కిందట పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో కాల్వపై రహదారిని నిర్మించే సమయంలో కాల్వ గూనల లెవెల్‌ను గుత్తేదారులు సరి చూస్కోలేదు. దీంతో కాల్వకు నీరు ఎక్కకపోవడంతో సింగిరెడ్డిపాలెం- తాళ్లకాంపాడ్ గ్రామాల రైతులకు చెందిన వందలాది ఎకరాలు నీరందక ఎండిపోయే పరిస్థితి నెలకొంది.
రైతులు తమ సమస్యను విన్నవిస్తూ రెండ్రోజుల క్రితం మంత్రి జగదీశ్‌రెడ్డికి వాట్సాప్ ద్వారా పంపారు. వెంటనే స్పందించిన మంత్రి జగదీశ్‌రెడ్డి పంచాయతీ, ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 24 గంటల్లో మూసీ కాల్వను పునరుద్ధరించి నీరు ప్రవహించే విధంగా చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో కదిలిన ఇరిగేషన్, పంచాయతీ రాజ్ అధికారులు 24 గంటల్లోపే కాల్వకు మరమ్మతు చేసి నీరు వెళ్లే విధంగా పునరుద్ధరించారు. దీంతో ఎండిపోయే స్థితిలోకి వెళ్లిన పంటలు తిరిగి జీవం పోసుకున్నాయి. వాట్సాప్ ద్వారా సమస్యను తెలిపినా తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రైతు బాంధవుడు జగదీశ్‌రెడ్డి అని కొనియాడారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

