రామగిరి, డిసెంబర్ 24 : క్రైస్తవుల ముఖ్యమైన పండుగ క్రిస్మస్ పండుగ వస్తోందంటేనే చర్చ్‌లలో దైవ ప్రార్థనలు ప్రారంభమవుతాయి. నల్లగొండ-దేవరకొండ రోడ్డులోని మరియ గుట్ట, మరియ మాత చర్చితో పాటు జిల్లా కేంద్రమైన నీలగిరిలోని పలు చర్చీలు క్రిస్మస్ వేడుకలకు ముస్తాబయ్యాయి. క్రీస్తు జన్మించిన డిసెంబర్ 25న క్రైస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంటారు. క్రిస్మస్ సందర్భంగా ఇండ్లపై స్టార్స్, క్రీస్తు జననానికి నిదర్శనంగా నిలిచిన పాకలు, క్రిస్మస్ సందర్భంగా విక్రయించే అలంకరణ వస్తువుల విక్రయాలు ఊపందుకున్నాయి. అన్ని చర్చీలు విద్యుత్ కాంతులతో వెలుగులు విరజిమ్ముతున్నాయి. ప్రపంచమంతా మినీ క్రిస్మస్ సంబురాలకు సిద్ధంగా కాగా బుధ, గురు, శుక్రవారాల్లో జరిగే పండుగ వేడుకలు అంబరాన్నంటేలా నిర్వహించనున్నారు.
ఏసుక్రీస్తు జన్మించిన రోజున క్రైస్తవులంతా భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఇండ్లపై నక్షత్రం ఆకారంలో ఉండే స్టార్లు, క్రీస్తు జననానికి నిదర్శనంగా నిలిచిన పాకలు, అలకంరణకు ఉపయోగించే పలు వస్తువుల విక్రయాలు ఊపందుకున్నాయి. అన్ని చర్చీలు విద్యుత్ దీప కాంతులతో వెలుగులు విరజిమ్ముతున్నాయి. అన్నిచోట్లా మినీ క్రిస్మస్ వేడుకలు జరుగుతుండగా గురు, శుక్రవారాల్లో పండుగ వేడుకలను అంబరాన్నంటేలా జరుపుకోనున్నారు.