e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home నాగర్ కర్నూల్ గులాబీ ప్రవాహంలో ప్రతిపక్షాలు గల్లంతే..

గులాబీ ప్రవాహంలో ప్రతిపక్షాలు గల్లంతే..

గులాబీ ప్రవాహంలో ప్రతిపక్షాలు గల్లంతే..
  • 20 వార్డుల్లో విజయఢంకా మోగిస్తాం
  • ఎన్నికల ప్రచార ర్యాలీలో విప్‌ గువ్వల

అచ్చంపేట రూరల్‌, ఏప్రిల్‌ 27: అచ్చంపేట మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రతిపక్షాలు గులాబీ ప్రవాహంలో గల్లంతు కావడం ఖాయమని ప్రభుత్వ విప్‌, ఎమ్మె ల్యే గువ్వల బాలరాజు అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా మంగళవారం పట్టణంలోని ప్రధా న రహదారుల గుండా భారీ ర్యాలీ చేపట్టారు. అం తకుముందు పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి టీఆర్‌ఎస్‌ శ్రేణులకు, కార్యకర్తలకు, అభిమానులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉ న్నారని, 20వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచి విజయఢంకా మోగిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలో సమీకృత మార్కెట్‌, స్మృతివనం, అంబేద్కర్‌ విజ్ఞాన కేంద్రం, ఎన్టీఆర్‌ మినీ స్టేడియం, ఇండోర్‌ స్టేడియం అభివృద్ధి పనులకు ఇటీవల మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేసినట్లు గుర్తు చేశారు. ప్రతిపక్షాలు, రైతులు సహకరిస్తే రెండేండ్లలోలో ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరందిస్తామని భరోసానిచ్చారు. అభివృద్ధిలో దూ సుకెళ్తున్న కారు గుర్తుకు ఓటేసి 20 వార్డుల్లోని అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, జీబీఆర్‌ చారిటబుల్‌ ట్రస్టు చైర్‌పర్సన్‌ గువ్వల అమల, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ తులసీరాం, అభ్యర్థులు అరుణ, రమేశ్‌, నర్సింహగౌడ్‌, శివ తదితరులు ఉన్నారు.
ఇంటింటి ప్రచారంలో విప్‌ గువ్వల
మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కోరారు. మంగళవారం పట్టణంలోని వెంకటేశ్వరకాలనీ, టీచర్స్‌కాలనీలో ఆయన ఇంటింటి ప్రచారం చేశారు. అచ్చంపేట పట్టణాన్ని అభివృద్ధిలో మరో సిద్దిపేటగా తీర్చిదిద్దుతానని భరోసానిచ్చారు. మిషన్‌భగీరథ పైప్‌లైన్‌ పనులు పూర్తయిన వెంటనే సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తిచేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా మినీ ట్యాంక్‌బండ్‌ పనులు పూర్తిచేసే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రతిఒక్కరూ 30న జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమం లో 11వ వార్డు అభ్యర్థి అరుణ, మద్దిమడుగు ఆల య చైర్మన్‌ విష్ణుమూర్తి, నాయకులు శ్రీను, బాబుసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గులాబీ ప్రవాహంలో ప్రతిపక్షాలు గల్లంతే..

ట్రెండింగ్‌

Advertisement