e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 8, 2021
Home నాగర్ కర్నూల్ సహకార సంఘాల ద్వారానే రైతుల అభివృద్ధి: మంత్రి నిరంజన్‌రెడ్డి

సహకార సంఘాల ద్వారానే రైతుల అభివృద్ధి: మంత్రి నిరంజన్‌రెడ్డి

తెలకపల్లి: సహకార సంఘాల ద్వారానే రైతులు అభివృద్ధి చెందుతున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతులకు సంక్షేమాలను అందిస్తూ వెన్నెముకగా టీఆర్ ఎస్ ప్రభుత్వం నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు.

శనివారం మండల పరిధిలోని చిన్నముద్దునూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం స్థలంలో రైతుల ప్రయో జనాలను దృష్టిలో ఉంచుకొని 2వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం, దుకాణాల సముదాయాల నిర్మాణాల ఏర్పా టుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శంఖుస్థాపన చేశారు.

- Advertisement -

అనంతరం సింగిల్ విండో చైర్మన్ డి.భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రైతుల, ప్రజల మేలు కోసం ఎన్నో రకాల సంక్షేమ పథకాలను అందించిందన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర టీఎస్‌సీ ఏబీ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్ పద్మావతి, పార్లమెంట్ సభ్యులు పి.రాములు, డీసీసీబీ కేంద్ర బ్యాంక్ అధ్యక్షుడు జక్కా రఘునందన్‌ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ హనుమంతురావు, ఏఎంసీ చైర్మన్ కుర్మయ్య, ఎంపీపీ కొమ్ము మధు, సర్పంచ్ దామోదర్‌రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ యాదయ్య, డైరెక్ట ర్లు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement