మంగళవారం 02 మార్చి 2021
Nagarkurnool - Jan 24, 2021 , 00:56:54

ప్రజలకు నమ్మకం కలిగించాలి

ప్రజలకు నమ్మకం కలిగించాలి

  • స్థాయీ సంఘం సమావేశంలో ఎంపీ రాములు

కందనూలు, జనవరి 23: ప్రభుత్వం నిర్మించే నిర్మాణాలపై అధికారులు ప్రజలకు నమ్మకం కలిగించాలని ఎంపీ రాము లు అన్నారు. శనివారం జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతి అధ్యక్షతన నిర్వహించిన స్థాయీ సంఘం సమావేశాలకు ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పరంగా చేపడుతున్న నిర్మాణాల్లో అవకతవకలు చోటుచేసుకోకుండా నాణ్యతగా ఉండాలని, ప్రారంభించిన పని వదిలిపెట్టకుండా పూర్తి చేయాలన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు పనులను పర్యవేక్షించాలన్నారు. అధికారులు గ్రామాల్లో పర్యటించి అభివృద్ధికి తోడ్పడాలన్నారు. అదేవిధంగా జిల్లాలో చేపట్టిన భవన నిర్మాణాలపై ఆరా తీశారు. అందుకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. సమావేశంలో వైస్‌ చెర్మన్‌ బాలాజీసింగ్‌, జెడ్పీటీసీలు భరత్‌ ప్రతాప్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

VIDEOS

logo