గురువారం 29 అక్టోబర్ 2020
Nagarkurnool - Oct 02, 2020 , 03:37:33

బాధితులను ఆదుకుంటాం..

బాధితులను ఆదుకుంటాం..

  • ఇండ్లు కూలి మృతి చెందిన  కుటుంబానికి రూ. 20వేల సాయం
  • మృతురాలి పార్థివ దేహానికి 
  • నివాళులర్పించిన ఎమ్మెల్యే  బీరం హర్షవర్ధన్‌రెడ్డి
  • కోడేరు పీహెచ్‌సీకి అంబులెన్స్‌, బావాయిపల్లి వాగుపై  వంతెనకు నిధులు మంజూరు

కోడేరు : బాధిత కుటంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రం లో మట్టి మిద్దె కూలి మృతి చెం దిన బస్వమ్మ(65) కుటుంబాన్ని గురువారం పరామర్శించి నివాళులర్పించారు. కుటుంబానికి రూ.20వేల నగదు అందజేశారు. ప్రభుత్వపరంగా కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం టీఆర్‌ఎస్‌ నాయకుడు పవన్‌కుమార్‌రెడ్డి స్వ గృహంలో మాట్లాడారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇండ్లు కూలిపోయి మృతి చెందడం దురదృష్టకరమని విచారం వ్య క్తం చేశారు.

పాడుబడిన ఇండ్లకు డబుల్‌ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వ పరంగా మంజూరు చేయిస్తానన్నారు. అలాగే కోడేరులో 20 ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న డబుల్‌ రోడ్డు వెడల్పు చేయడం జరిగిందని, త్వరలోనే పనులను ప్రారంభిస్తామని, కరోనా ఉన్నందున ఆలస్యం అవుతున్నదన్నారు. బావాయిపల్లి వాగుపై వంతెన నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యాయని, కోడేరు పీహెచ్‌సీకి కొత్తగా అంబులెన్స్‌ మంజూరు చేయించడం జరిగిందన్నారు. కొంతమంది కాంట్రాక్టర్లు పనులను సకాలంలో పూర్తి చేయడం లేదని వారిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల సంక్షేమం కోసం పని చేసే సర్కారు అన్నారు. మండలంలో నెలకొన్న అన్ని సమస్యలను త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే వివరించారు.

అంతకుముందు జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ శేఖర్‌రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పలుకరించారు. కార్యక్రమంలో తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘువర్ధన్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, మండల విండో చైర్మన్‌ చిన్నారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాజశేఖర్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు చెన్నయ్య, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు జగదీశ్వర్‌రావు, నాయకుడు పవన్‌కుమార్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ జంబులయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 



logo