బుధవారం 12 ఆగస్టు 2020
Nagarkurnool - Aug 01, 2020 , 08:52:51

‘కరోనాపై నిర్లక్ష్యం తగదు’

‘కరోనాపై నిర్లక్ష్యం తగదు’

కల్వకుర్తి రూరల్‌ : గ్రామాల్లో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌పై ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని మార్చాల  సర్పంచ్‌ ఆవ మల్లయ్య అన్నారు. శుక్రవారం కల్వకుర్తి మండలంలోని మార్చాల సత్యసాయినగర్‌ కాలనీలోని  కాటన్‌ మిల్లులో ఓ వ్యక్తికి కరోనా వైరస్‌ సోకడంతో కాలనీని,  వీధులను హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించి బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించారు. కరోనా నివారణకు వారం రోజులపాటు మిల్లును నిలిపివేయాలని కోరారు. మిల్లు పరిసరాల్లో దుకాణాలను, హోటళ్లను మూసివేసి స్వచ్ఛంద బంద్‌ను పాటించాలని కోరారు.  ప్రజలు కరోనాపై అప్రమత్తంగా ఉండాల ని అనవసరంగా బయటకు రావద్దని కోరారు. ఆరోగ్య నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు. ఆరోగ్యం ఏమాత్రం అశ్రద్ధ వహించవద్దని సూచించారు. కార్యక్రమంలో నాయకులు మల్లేశ్‌, వార్డు సభ్యులు లింగం, భాస్కర్‌కాలనీ వాసులు  తదితరు లు ఉన్నారు.


logo