శుక్రవారం 07 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 21, 2020 , 00:17:49

పితృదేవోభవ

పితృదేవోభవ

పిల్లల భవిష్యత్‌కు అనుక్షణం తపన పడే నిస్వార్థపు మనిషి.. పిల్లల తప్పటడుగులను సరిదిద్దుతూ బయటకు కోపంగా కనిపించినా.. మనసులో బోలెడంతా ప్రేమను దాచుకుంటాడు.. వారి భవితకు తన సంతోషాన్ని త్యజించే త్యాగమూర్తి.. నాన్నంటే ధైర్యం, బాధ్యత, భద్రత, భరోసా.. తన బిడ్డలే జీవితంగా బతుకుతాడు.. జీవితాంతం వారి సుఖం కోసం రక్తాన్ని చెమటగా చిందిస్తాడు.. తన బిడ్డలు ప్రయోజకులుగా ఒక్కో మెట్టు ఎక్కుతుంటే ఆనందంతో మురిసిపోతాడు నాన్న..  నేడు నాన్నల దినోత్సవం ..

  • బాధ్యతకు మారుపేరు ‘నాన్న’
  • నేడు ఫాదర్స్‌ డే

కల్వకుర్తి : కుటుంబ సంక్షేమానికి కొవ్వొత్తిలా కరుగుతూ.. తన కష్టాన్ని పిల్లలకు తెలియనివ్వకుండా.. చిరునవ్వుతో ప్రేమను పంచుతూ.. బాధ్యతకు మారుపేరుగా, పిల్లలకు రోల్‌మోడల్‌గా నిలుస్తున్న నాన్న ఎప్పటికీ హీరోనే.. నేడు ఫాదర్స్‌ డే సందర్భంగా తండ్రులకు శుభాకాంక్షలు తెలుపేందుకు పిల్లలు సిద్దమయ్యారు. బాధ్యతకు మారుపేరుగా నిలిచే నాన్నలకు కూడా ఒక రోజు కేటాయించాలని అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్‌ డాడ్‌ అనే మహిళ ఆలోచించి ప్రచారం మొదలు పెట్టింది. ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగా 1910లో మొదటిసారి ఫాదర్స్‌ డే గుర్తించి జరుపుకొన్నారు. ఆ తరాత అలా ఈ నాన్నల వందన దినోత్సవానికి ఆదరణ పెరుగుతూ వచ్చింది. ప్రపంచ దేశాలు 1972 నుంచి ఏటా జూన్‌లో వచ్చే మూడో ఆదివారాన్ని పితృవందన దినోత్సవంగా ప్రకటించుకుని జరుపుకొంటున్నాయి.


logo