గురువారం 13 ఆగస్టు 2020
Nagarkurnool - Jun 07, 2020 , 03:43:57

రివ్యూ పిటీషన్లను వెంటనే పరిష్కరించాలి

రివ్యూ పిటీషన్లను వెంటనే పరిష్కరించాలి

డీఆర్‌వో మధుసూదన్‌నాయక్‌ 

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: హైకోర్టు డబ్ల్యూపీఎస్‌ రివ్యూ పిటీషన్లను వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అధికారి మధుసూదన్‌నాయక్‌ సూచించారు. శనివారం తాసిల్దార్‌, ఆర్డీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ మండలాల్లో హైకోర్టు డబ్ల్యూపీఎస్‌ రెట్‌ పిటీషన్లను త్వరగా పరిష్కరించాలని తాసిల్దార్లను డీఆర్‌వో ఆదేశించారు. జిల్లాకు సంబంధించి వివిధ మండలాల్లో 25 పిటీషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించేందుకు తాసిల్దార్లు హైకోర్టు ఏజీని సంప్రదించి అందుకు కావాల్సిన డాక్యుమెంట్లను అందజేయాలన్నారు. సంబంధిత వివరాలను కలెక్టర్‌ కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. అదేవిధంగా రంజాన్‌ మాసంలో మసీదుల ఆధునీకరణకు విడుదలైన నిధుల వినియోగ యూసీలను వెంటనే సమర్పించాలన్నారు. ప్రకృతి వైపరిత్యాల వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాల ప్రాథమిక నివేదికలను కలెక్టర్‌ కార్యాలయానికి ఎప్పటికప్పుడు చేరవేయాలని డీఆర్‌వో ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కొల్లాపూర్‌ ఆర్డీవో శ్రీరాములు, కలెక్టరేట్‌ ఏవో జాకీర్‌అలీ తదితరులు పాల్గొన్నారు. logo