శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Mar 07, 2020 , 00:23:06

వైద్య సేవలు భేష్‌..

వైద్య సేవలు భేష్‌..

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం): మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ దవాఖానలో రోగులకు  అందిస్తున్న వైద్యసేవలు బాగున్నాయని ఢిల్లీ వైద్యబృందం ప్రశంసించింది. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ట్రామా కేర్‌ సెంటర్‌ను ఢిల్లీ వైద్య బృందం డాక్టర్‌ బీఎస్‌ బాటియా ఆధ్వర్యంలో పరిశీలించింది. ట్రామా కేర్‌ సెంటర్‌కు సంబంధించిన వివరాలను దవాఖాన ఆర్థోపేడిక్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్‌, సూపరింటెంటెంట్‌ రాంకిషన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ట్రామా కేర్‌ సెం టర్‌ ద్వారా 1112 మైనర్‌ సర్జరీలు, 357 మేజర్‌ సర్జరీలు చేశామని సూపరింటెండెంట్‌ తెలిపారు. అయితే, ట్రామా కేర్‌ సెంటర్‌కు ప్రత్యేక వైద్యులు, సిబ్బందిని ఏర్పాటు చేసి నడిపిస్తున్న తీరుపై ఢిల్లీ బృందం అభినందించింది. ట్రా మా కేర్‌ సెంటర్‌ అభివృద్ధి కోసం రూ.4కోట్ల బడ్జెట్‌ మం జూరు కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో సెంట్రల్‌ టీం కేర్‌ కోఆర్డినేటర్‌ రవీంద్ర, మెడికల్‌ కళాశాల డైరెక్టర్‌ పుట్టా శ్రీనివాస్‌. సూపరింటెండెంట్‌ జీవన్‌, నర్సింహారావు, ఆర్‌ఎంవో వకూలా, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సంపత్‌, శరత్‌, వసంత్‌, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


logo