శుక్రవారం 30 అక్టోబర్ 2020
Mulugu - Sep 27, 2020 , 07:33:08

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

  • సీడీపీవో దేవరశెట్టి లక్ష్మి 

ములుగురూరల్‌, సెప్టెంబర్‌ 26 : అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా ప్రభుత్వం అందించే పౌష్టికాహారంతో గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని సీడీపీవో దేవరశెట్టి లక్ష్మి అన్నారు. ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే పోషణ మాసంలో భాగంగా శనివారం మండలంలోని జాకా రం అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా సర్పంచ్‌ దాసరి రమేశ్‌తో పాటు సీడీపీవో హాజరై మాట్లాడారు. అంగన్‌వాడీ సెంటర్‌ ద్వారా అందించే పాలు, గుడ్లు, భోజనం అందించాలని సూచించారు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. 

గోవిందరావుపేట: ఆకు కూరలతో పోషకాహారం లభిస్తుందని సర్పంచ్‌ లావుడ్యా లక్ష్మి అన్నారు. పోషణాభియాన్‌ మాసోత్సవాన్ని పురష్కరించుకొని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రమ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. మునగ, గొంగూర, మెంతి, తోటకూర సాగు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు జయలక్ష్మి, సరోజన, రాణి, కరుణ, విజయలక్ష్మి పాల్గొన్నారు.