e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News భార్య ఆత్మ‌హ‌త్య కేసులో దివంగ‌త న‌టుడి కుమారుడు అరెస్టు

భార్య ఆత్మ‌హ‌త్య కేసులో దివంగ‌త న‌టుడి కుమారుడు అరెస్టు

భార్య ఆత్మ‌హ‌త్య కేసులో దివంగ‌త న‌టుడి కుమారుడు అరెస్టు

తిరువ‌నంత‌పురం : దివంగ‌త మ‌ల‌యాళ న‌టుడు రాజ‌న్ పి.దేవ్ కొడుకు ఉన్ని దేవ్‌ను పోలీసులు మంగ‌ళ‌వారం అరెస్టు చేశారు. భార్య ప్రియాంక‌ ఆత్మ‌హ‌త్య కేసులో పోలీసులు ఇత‌డిని క‌స్ట‌డిలోకి తీసుకున్నారు. ఉన్ని దేవ్ కూడా ప‌లు మలయాళ చిత్రాల్లో నటించాడు. నేదుమంగాడ్ పోలీసు బృందం ఎర్నాకుళం జిల్లాలోని తన ఇంటికి వచ్చి అతన్ని అదుపులోకి తీసుకుంది.

ఉన్ని దేవ్ భార్య మే 12 న వట్టాపర వద్ద తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఆత్మ‌హ‌త్య‌కు ఒక్క‌రోజు ముందు ఆమె గృహ‌హింస ఫిర్యాదు చేసింది. పోలీసులు అస‌హ‌జ మ‌ర‌ణంగా కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్రియాంక సోద‌రుడు కూడా ఉన్ని ఇంట్లో ఆమె ఎదుర్కొన్న హింస‌ల గురించి ఫిర్యాదు చేశాడు.

ఉన్ని తండ్రి రాజ‌న్ పి. దేవ్ విశేష ప్రజాదరణ పొందిన సినీ నటుడు. 200 కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన 2009 లో కన్నుమూశారు. ఉన్ని, ప్రియాంక 2019 లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం అనంత‌రం ఆమె ఒక ప్రైవేట్ పాఠశాలలో ఫిజిక‌ల్ ఎడ్యూకేష‌న్ టీచ‌ర్‌గా పనిచేస్తోంది. ఆమె బంధువుల క‌థ‌నం ప్రకారం.. వారి వైవాహిక జీవితం మొదట్లో బాగానే ఉంది. కొంతకాలం తర్వాత సమస్యలు ప్రారంభ‌మ‌య్యాయి. ఇవి తారాస్థాయికి చేరుకున్నాయి. ఆమె త‌న ఇంటికి రావాల‌ని నిశ్చ‌యించుకుని వ‌చ్చిన మ‌రుస‌టి రోజే ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
భార్య ఆత్మ‌హ‌త్య కేసులో దివంగ‌త న‌టుడి కుమారుడు అరెస్టు

ట్రెండింగ్‌

Advertisement