బుధవారం 02 డిసెంబర్ 2020
Medchal - Sep 05, 2020 , 01:02:49

టీచర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

టీచర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా

 కుత్బుల్లాపూర్‌, సెప్టెంబర్‌4:  ప్రైవేట్‌ టీచర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ హామీ ఇచ్చారు. శుక్రవారం కుత్బుల్లాపూర్‌ చింతల్‌ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేతో ప్రైవేట్‌ బడ్జెట్‌ పాఠశాలల సంఘం ప్రతినిధులు తమ సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చర్చించారు. లాక్‌డౌన్‌ చేయడం ద్వారా ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేక, విద్యుత్‌ బిల్లులు, నీటి బిల్లులు, పాఠశాలల భవనాల పన్నులు, కిరాయిలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని, ప్రతి ఉపాధ్యాయుడికి  రూ. 10 వేల చొప్పున నిరుద్యోగ భృతి కింద చెల్లించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సానుకూలంగా స్పందిస్తూ సమస్యను వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో చర్చిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వరప్రసాద్‌, చైర్మన్‌ శివయ్య, సలహాదారు శ్రీనివాస్‌గౌడ్‌, కార్యదర్శి మహేశ్‌కుమార్‌, దయాకర్‌, చింతల మల్లేశ్‌, అశోక్‌, వనజ, మంతెన లింగయ్య పాల్గొన్నారు.