e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home మేడ్చల్-మల్కాజ్గిరి ఆహార సమస్య రానివ్వం

ఆహార సమస్య రానివ్వం

ఆహార సమస్య రానివ్వం

ఉప్పల్‌, మే 16: పేదలు, వలస కూలీలలకు ఆహార సమస్య రాకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. చిలుకానగర్‌ డివిజన్‌లోని సర్వే ఆఫ్‌ ఇండియా చౌరస్తాలో రూ. 5భోజన కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, చిలుకానగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ బన్నాల గీతాప్రవీణ్‌ ముదిరాజ్‌ హాజయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఆకలి బాధలతో ఇబ్బందులు పడకుండా రూ. 5 భోజన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రోజువారి కూలీలు, పేదలకు ఇబ్బందులు కలుగకుండ చూస్తున్నామని పేర్కొన్నారు. పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో భోజన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా పేషెంట్లకు ఇంటికి భోజనం పంపించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో చిలుకానగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్‌ ముదిరాజ్‌, ఈఈ నాగేందర్‌, నేతలు గడ్డం రవికుమార్‌, పల్లె నర్సింగ్‌రావు, రాంరెడ్డి, అబ్బుబాయ్‌, పండ్ల కిషన్‌, శ్రీనివాస్‌, రామానుజన్‌, గరిక సుధాకర్‌, కొకొండ జగన్‌, మహమూద్‌, రాంచందర్‌, ప్రవీణ్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

మెట్రోస్టేషన్‌ సమీపంలో ..

ఉప్పల్‌: ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలో రూ. 5భోజన కేంద్రాన్ని ఆదివారం ఉప్పల్‌ కార్పొరేటర్‌ మందుముళ్ల రజితాపరమేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలు ఆహారం కోసం ఇబ్బందులు పడకుండా డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ పరమేశ్వర్‌రెడ్డి, నేతలు ప్రభాకర్‌రెడ్డి, మురళీకృష్ణారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, జిత్తురెడ్డి, నరేశ్‌, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆహార సమస్య రానివ్వం

ట్రెండింగ్‌

Advertisement