మంగళవారం 20 అక్టోబర్ 2020
Medchal - Sep 29, 2020 , 00:27:02

అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి

అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి

పీర్జాదిగూడ : పీర్జాదిగూడ నగరపాలక పరిధిలో సుమారు రూ.1.23 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను, పర్వతాపూర్‌ డంపింగ్‌ యార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన కుక్కల సంతాన నియంత్రణ కేంద్రాన్ని సోమవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్‌ జక్క వెంకట్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా గార్డెన్‌ పార్కు, బుద్దానగర్‌లోని పార్కులను, 10స్వచ్ఛ ఆటోలను మంత్రి ప్రారంభించారు. అనంతరం బుద్దానగర్‌ సాయిబాబా గుడి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేడిపల్లి మండల పరిధిలోని 62మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ జాన్‌శ్యాంసన్‌, నగరపాలక టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు దర్గ దయాకర్‌ రెడ్డి, డిప్యూటీ మేయర్‌ శివకుమార్‌, కార్పొరేటర్లు శారద ఈశ్వర్‌రెడ్డి, యుగేందర్‌రెడ్డి, హరిశంకర్‌ రెడ్డి, నవీన్‌రెడ్డి, అనంతరెడ్డి, సుభాష్‌నాయక్‌, అమర్‌సింగ్‌, పోచయ్య, సరితా దేవేందర్‌గౌడ్‌, బండి రమ్యసతీశ్‌గౌడ్‌, నాయకులు తూకుంట శ్రీధర్‌రెడ్డి, పప్పుల అంజిరెడ్డి, కుర్ర శ్రీకాంత్‌ గౌడ్‌, బుచ్చియాదవ్‌, బొడిగ కృష్ణగౌడ్‌, పెంటయ్య గౌడ్‌, మహేశ్‌, జయేందర్‌, జావిద్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.


logo