శుక్రవారం 22 జనవరి 2021
Medchal - Nov 24, 2020 , 08:56:41

ఎన్నికల మ్యానిఫెస్టో అన్నివర్గాల ప్రజలకు వరం

ఎన్నికల మ్యానిఫెస్టో అన్నివర్గాల ప్రజలకు వరం

జీడిమెట్ల: సీఎం కేసీఆర్‌ ప్రకటించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టో అన్నివర్గాల ప్రజలకు వరమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ రంగారెడ్డినగర్‌ డివిజన్‌ పరిధిలోని గురుమూర్తినగర్‌, గిరినగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బి.విజయ్‌శేఖర్‌గౌడ్‌తో కలిసి మంత్రి పాదయాత్రగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు. రూ.65వేల కోట్లతో హైదరాబాద్‌లో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు దక్కకుండా ప్రజలందరూ కారు గుర్తుకే ఓటేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రేటర్‌ ఎన్నికల్లో వంద సీట్లు సాధించి సెంచరీ కొడుతామని స్పష్టం చేశారు. 

భారీ మెజార్టీ అందించాలి

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గుడిమెట్ల హేమలతకు అత్యధిక మెజార్టీ అందించాలని మాజీ కార్పొరేటర్‌ గుడిమెట్ల సురేశ్‌రెడ్డి కోరారు. సోమవారం సుభాష్‌నగర్‌లో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఆయన సమక్షంలో వివిధ పార్టీల నాయకులు భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరా రు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గుడిమెట్ల హేమలత మహిళలతో కలిసి సూరారం కాలనీలో పాదయాత్ర చేస్తూ కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. 

చింతల్‌లో మరింత అభివృద్ధి

తనకు అవకాశం కల్పిస్తే చింతల్‌ డివిజన్‌ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రషీదాబేగం పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవా రం ఆమె ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ, తనను మరోసారి గెలిపిస్తే డివిజన్‌ను మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఓల్డ్‌ చింతల్‌లో కురుమ సం ఘం అధ్యక్షుడు మధుకుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి డివిజన్‌ ఎన్నికల ఇన్‌చార్జి, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ హాజరయ్యారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రషీదాబేగాన్ని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు శ్రీశైలం, ప్రేమ్‌కుమార్‌, చింతల్‌ డివిజన్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ రఫీ తదితరులు పాల్గొన్నారు. 

ఆశవహులకు ప్రాధాన్యం: ఎమ్మెల్యే వివేకానంద్‌ 

నామినేషన్లు ఉపసంహరించుకున్న టీఆర్‌ఎస్‌ రెబ ల్స్‌, ఆశవహులకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుందని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ పేర్కొన్నారు. సుభాష్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని సూరారం కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తున్నారన్నారు. కార్యకర్తలు నిరాశ పడకుండా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు. రాబోయే రోజుల్లో ఆశవహులకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నేత శీలం వీరేంద్రకుమార్‌, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

ప్రతిపక్షాలకు బుద్ది చెప్పండి

గాజులరామారం: ఇంటింటికీ వస్తున్న ప్రతిపక్షాలకు ఓట్లతో బుద్ది చెప్పి టీఆర్‌ఎస్‌ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం సాయంత్రం వారు గాజులరామారం డివిజన్‌ పరిధిలోని దేవేందర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రావుల శేషగిరికి మద్దతుగా కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వాల హయాంలో దేవేందర్‌నగర్‌, రావీనారాయణరెడ్డి నగర్‌, పోచమ్మ బస్తీల ప్రజలు కనీస సౌకర్యాలకు నోచుకోక ఇబ్బందిపడ్డారని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ హయాంలో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ కోట్లాది రూపాయలతో బస్తీల్లో తాగునీరు, భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్డు, విద్యుత్‌ లైట్లు వంటి అనేక సౌకర్యాలను కల్పించారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 

మంత్రుల సమక్షంలో చేరికలు

గాజులరామారం డివిజన్‌ దేవేందర్‌నగర్‌లో సోమవారం సాయంత్రం మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి సమక్షంలో సుమారు 500మంది మహిళలు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రులు కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రావుల శేషగిరి గెలుపు కోసం కష్టపడి పని చేయాలని వారు కార్యకర్తలకు సూచించారు. logo