బుధవారం 20 జనవరి 2021
Medchal - Oct 30, 2020 , 08:18:07

వారానికోసారి ‘సదరం’

వారానికోసారి ‘సదరం’

మల్కాజిగిరి: మల్కాజిగిరిలోని జిల్లా కేంద్ర దవాఖానలో సదరం(దివ్యాంగుల నిర్ధారణ)శిబిరం దివ్యాంగులకు సౌకర్యంగా మారింది. వారానికి ఒకసారి దివ్యాంగులకు నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నారు. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో 50 మందికి మించకుండా నిర్ధారణ పరీక్షలను చేస్తున్నారు. నిర్ధారణ అనంతరం రెండు రోజుల తర్వాత ధ్రువీకరణ పత్రాలను దివ్యాంగులకు వైద్యులు అందజేస్తున్నారు. మీసేవా కేంద్రాల్లో స్లాట్‌బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే సదరం శిబిరంలో వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఆధార్‌కార్డు, ఫొటోతో సహా స్లాట్‌బుక్‌చేసుకుని నిర్ధారణ పరీక్షలకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. దివ్యాంగులను మూడు విభాగాలుగా విభజించి వారానికి ఒకరోజు ఆర్థో, చెవి, కన్ను, మానసిక దివ్యాంగులకు 50 మందికి నిర్ధారణ  పరీక్షలను నిర్వహిస్తూ దివ్యాంగులు అసౌకర్యానికి గురికాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ధ్రువీకరణ పత్రాల ద్వారా దివ్యాంగులకు ప్రభుత్వం అందించే రాయితీలను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉద్యోగ, చదువు, రవాణా, పింఛన్లను పొందుతున్నారు. 

 38 మందికి నిర్ధారణ పరీక్షలు 

మల్కాజిగిరి జిల్లా కేంద్ర దవాఖానలో గురువారం నిర్వహించిన సదరం శిబిరంలో 38 మందికి వైద్యులు పరీక్షలను నిర్వహించారు. రెండు రోజుల్లో ధ్రువీకరణ పత్రాలను అందజేయనున్నట్లు వైద్యులు తెలిపారు. నిర్ధారణ పరీక్షలకు 47 మంది స్లాట్‌బుక్‌ చేసుకోగా 38 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. 

స్లాట్‌బుక్‌ చేసుకున్న వారికే నిర్ధారణ పరీక్షలు

మీసేవలో స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికే దివ్యాంగుల నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నాం. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో వారానికి ఒకరోజు 50 మందికి మాత్రమే పరీక్షలను చేస్తు న్నాం. రెండు రోజుల అనంతరం ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్నాం. మీ సేవా కేంద్రాల్లో ఆధార్‌కార్డ్‌, ఫొటోతో సహా దివ్యాంగులు స్లాట్‌ను బుక్‌  చేసుకోవాలి. సదరం శిబిరానికి వచ్చే  అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాం. -దవాఖాన సూపరింటెండెంట్‌, రాజు


logo