శుక్రవారం 04 డిసెంబర్ 2020
Medchal - Oct 29, 2020 , 09:37:51

దగ్గరి బంధువులే దోపిడీ దొంగలు..

దగ్గరి బంధువులే దోపిడీ దొంగలు..

ఘట్‌కేసర్‌ రూరల్‌: చెడు వ్యసనాలకు బానిసలుగా మారి.. సమీప బంధువు మెడలోని పుస్తెల తాడును అపహరించుకుపోయిన ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. ఘట్‌కేసర్‌ సీఐ ఎన్‌.చంద్రబాబు కథనం ప్రకారం.. పోలీస్‌స్టేషన్‌ పరిధి కొర్రెముల గ్రామానికి చెందిన బైండ్ల లక్ష్మమ్మ దసరా రోజు రాత్రి పాల పాకెట్‌ కోసం కిరాణం దుకాణానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో బాధితురాలి బంధువులైన బైండ్ల లక్ష్మణ్‌(23), మైనర్‌ బాలుడు(17) మహిళను కింద పడేసి ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కుని పారిపోయినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వారిని పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడు లక్ష్మణ్‌ను రిమాండ్‌కు, బాలుడిని జువైనల్‌ హోమ్‌కు తరలించి కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఒక్క రోజులోనే నిందితులను గుర్తించి అరెస్టు చేసిన అడిషనల్‌ సీఐ ఇ. జంగయ్య, మల్కాజిగిరి సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేందర్‌రెడ్డి, ఎస్సై జగన్మోహన్‌రెడ్డి, సిబ్బంది బ్రహ్మం, శశిలను అభినందించారు.