పట్టణాలు, మున్సిపాలిటీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారని సంగారెడ్డి జడ్పీచైర్‌పర్సన్ మంజుశ్రీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పట్టణంలోని పీఎస్ఆర్ గార్డెన్లో నిర్వహించిన ‘పట్టణ ప్రగతి’ వేడుకలకు ఆమె హెచ్‌డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్‌తో కలిసి హాజరయ్యారు. అందోల్, జహీరాబాద్, పటాన్చెరు, మెదక్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక తొమ్మిదేండ్లలో అరవై ఏండ్ల అభివృద్ధి జరిగిందన్నారు. తాగు, సాగునీటికి ఢోకా లేదని, 24గంటలు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. పారిశుధ్య నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఉత్తమ సేవలందించిన సర్పంచ్‌లు, కార్యదర్శులు, అధికారులకు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. పలుచోట్ల చెత్త సేకరించే వాహనాలు, ట్యాంకర్లతో భారీ ర్యాలీ చేపట్టారు. చౌరస్తాల్లో మానవహారాలు
నిర్వహించారు.
– మెదక్/ సంగారెడ్డి న్యూస్‌నెట్ వర్క్, జూన్ 16
తూప్రాన్/ నర్సాపూర్/ రామాయంపేట, జూన్ 16 : అభివృద్ధిలో తూప్రాన్ మున్సిపాలిటీ ఆదర్శంగా నిలుస్తున్న దని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది దినోత్సవాల్లో భాగంగా శుక్రవా రం తూప్రాన్ మున్సిపాలిటీలో నిర్వహించిన ‘పట్టణ ప్రగతి దినోత్సవం’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తూప్రాన్ పాత మున్సిపల్ కార్యాలయం నుంచి కొత్త కార్యాలయం వరకు సఫాయి కార్మి కులు బోనాలు, జాతీయజెండాతో భారీ ర్యాలీ నిర్వహించా రు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లా డుతూ తూప్రాన్ మున్సిపాలిటీ అభివృద్ధిలో శరవేగంగా దూ సుకుపోతూ ఉత్తమ మున్సిపాలిటీగా రూపుదిద్దుకుందన్నారు. పట్టణంలో పారిశుధ్య పనులు, క్రీడా ప్రాంగణాలు, పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేసిన తీరు అద్భుతంగా ఉందన్నా రు. మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్‌గౌడ్ మాట్లాడుతూ.. పట్ట ణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతున్నానన్నారు. ఉత్తమ చైర్మన్‌తోపాటు మూడు అవార్డులను తూప్రాన్ మున్సిపాలిటీ కైవసం చేసుకో వడం ఆనందంగా ఉందన్నారు. హరితహారంలో 11వ వార్డు కౌన్సిలర్ బొంది అరుణావెంకట్గౌడ్, శానిటేషన్‌లో 2వ వార్డు కౌన్సిలర్ భైరం ఉమాసత్యలింగం, ఉత్తమ కమిష నర్ గా మోహన్ అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ మోహన్, మేనేజర్ రఘువరన్, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉత్తమ మున్సిపల్ చైర్మన్‌గా రాఘవేందర్‌గౌడ్
ఉత్తమ మున్సిపల్ చైర్మన్ అవార్డు తూప్రాన్ పట్టణానికి వరించింది. మున్సిపల్ చైర్మన్ బొంది రాఘవేందర్గౌడ్కు ఉత్తమ చైర్మన్‌గా కలెక్టర్ రాజర్షిషా, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, అదనపు కలె క్టర్ ప్రతిమాసింగ్ ప్రశంసాపత్రాన్ని అందజేశారు. మెదక్ కలె క్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో అవార్డు అందుకున్నా రు. కౌన్సిలర్లు అరుణావెంకట్గౌడ్, ఉమా సత్యలింగం, శాని ఉత్తమ మున్సిపల్ కమిషనర్‌గా మోహన్‌కు కలెక్టర్ రాజర్షిషా ప్రశంసా పత్రాలు అందజేసి, సన్మానించారు.
నర్సాపూర్ మున్సిపాలిటీలో సంబురాలు
నర్సాపూర్ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు మున్సిపల్, వైద్య, ఆరోగ్యశాఖ, మెప్మా, ఐసీడీఎస్, డ్వాక్రా మహిళలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లతో పాటు రక్షణ సామగ్రిని అందజేశారు. వివిధ శాఖల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బంది, మహిళలను ప్రశంసాపత్రం అందజేసి, సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ మాట్లాడుతూ.. పట్టణ ప్రగతిలో నర్సాపూర్ మున్సిపాలిటీ అన్నివిధాలా అభివృద్ధ్ది చెందిందన్నారు. పట్టణంలో పారిశుధ్య పనులు సక్రమంగా జరిగాయని, పురాతన శిథిలాలను తొలిగించామని, లక్ష్యానికి మించి హరితహారం చేపట్టా మని గుర్తుచేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, వైద్యారోగ్య శాఖ, మెప్మా, ఐసీడీఎస్ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.
సఫాయి కార్మికులు ఆదర్శమూర్తులు
* ‘పేట’ అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం
రామాయంపేటలో నిర్వహిచిన పట్టణ ప్రగతి సంబురాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులను సన్మానించి,జ్ఞాపికలను అందజేశారు. అనంతరం విద్యార్థులతో మహార్యాలీ చేపట్టి అంబేద్కర్ సర్కిల్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, కమిషనర్ ఉమాదేవి, వైస్ చైర్పర్సన్ పుట్టి విజయలక్ష్మి మా ట్లాడారు. సఫాయి కార్మికులు ఆదర్శమూర్తులని, చేసిన సేవ లు అమోఘమన్నారు. కరోనా సమయంలో వారు చేసిన సేవ లు వెలకట్టలేనివన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ చంద్రం, ఏఎంసీ చైర్మన్ యాదగిరి, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఏఈ కుషాల్, కౌన్సిలర్లు యాదగిరి, నాగరాజు, సౌభాగ్య, శోభ, కవిత, కో ఆప్షన్ సభ్యు లు ప్రభావతి, హైమద్, బాలుగౌడ్, కౌసర్‌బేగం, నాయకులు కొండల్‌రెడ్డి, అస్నొద్దీన్, మున్సిపల్ సిబ్బంది కాలేరు ప్రసాద్, నవాత్ ప్రసాద్, శంకర్, పద్మ, శ్రీనివాస్ పాల్గొన్నారు.