సంగారెడ్డి, మే 16: అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన అన్ని హామీలు అమ లు చేసి మాట నిలబెట్టుకోవాలని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి డిమాం డ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుమేరకు గురువారం సంగారెడ్డిలోని ఆర్డ్డీవో కార్యాలయం ఎదుట నిరస న చేపట్టారు. కొత్త బస్టాండ్ నుంచి ఆర్డీవో కార్యాల యం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను వీడాలన్నారు.
అధికారంలోకి రాగానే వరికి బోనస్ రూ.500లు ఇస్తామన్న హామీ ఇప్పుడు సాధ్యం కాదని అనడం సరికాదన్నారు. ఏడాదికి ఒక ముఖ్యమంత్రిని మార్చే సంస్కృతి కాంగ్రెస్‌లో ఉన్నదని, ఆగస్టులో ప్రభుత్వంలో ప్రకంపన లు ప్రారంభమవుతాయని జోస్యం చెప్పారు. అందుకే సీఎం ఏమి మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. రైతు పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని జడ్పీచైర్‌పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి తెలిపారు. నిరసన లో కంది జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, కోడూరి రమేశ్, మల్లన్న, మనోహర్‌గౌడ్, వరలక్ష్మి, వెంకటేశ్వ ర్లు, పాండు, చక్రపాణి, ఆంజనేయులు, మధుసూదన్‌రెడ్డి, రఘు, ఇంద్రారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, పుల్లారెడ్డి, రుక్ముద్దీన్, ప్రేమానందం, వరకుమార్, శ్రావణ్‌రెడ్డి, నా యకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.