MLA Rohitrao | మెదక్ రూరల్ (హవేలీ ఘన్పూర్) : నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావ్ అన్నారు. శనివారం హవేలి ఘనపురం మండల పరిధిలో నూతనంగా రూ. 43 కోట్లతో ఏర్పాటుచేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువతకు నైపుణ్యంతోపాటు నాణ్యతను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యువత ఉపాధి అవకాశాల కల్పనకు ఆధునిక సాంకేతికతతో కూడిన పరిజ్ఞానం చాలా అవసరమని తెలిపారు. ఏటీసీ కేంద్రాల ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థులకు పరిశ్రమలతోపాటు ప్రయివేటు రంగాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఏటీసీ కేంద్రానికి రూ.43 కోట్లు మంజూరు చేయడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏటీసీ కేంద్రంలో 6 ట్రేడుల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తారని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాధించి తల్లిదండ్రులకు, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ మిమ్మల్ని చదివిస్తున్నారని ప్రయోజకులై తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలని స్పష్టం చేశారు.
Read Also :
Karepally : ‘వ్యవసాయానికి సబ్సిడీల తగ్గింపులో భాగమే యూరియా కొరత’
Kothagudem Urban : లంబాడీల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలి : గుగులోతు రాజేశ్ నాయక్
ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎల్లంపేట టౌన్‌ప్లానింగ్ అధికారి రాధాకృష్ణా రెడ్డి