కొల్చారం, అక్టోబర్ 27 : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని సంగాయిపేటలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. కొల్చారం పోలీసుల కథనం ప్రకారం..సంగాయిపేట తండాకు చెందిన లంబాడి రాజు(28) సంగాయిపేట పెట్రోల్ పంపులోకి వెళ్లి బైక్‌లో పెట్రోల్ పోసుకుని తిరిగి వస్తుండగా.. ఎదురుగా వస్తున్న మరో మోటర్ సైకిల్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స కోసం దవాఖానకు తరలిస్తుండగా మార్గమద్యంలోనే మృతి చెందాడు. ఈ మేరకు కొల్చారం పొలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.