మెదక్ బీఆర్ఎస్లో జోష్ పెరిగింది. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన యువ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. బుధవారం రాత్రి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామ కాంగ్రెస్, బీజేపీలకు చెందిన యువ నాయకులు 100మంది, ఇతర నాయకులు 50మంది బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరుతున్నాయని, వాటికి ఆకర్షితులై అనేకమంది బీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు.
– మెదక్, జూలై 19 (నమస్తేతెలంగాణ)