సిద్దిపేట,అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి):కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇం టిగ్రేటెడ్ స్కూల్స్‌ను కొన్ని నియోజకవర్గాలకే కేటాయించడంపై విద్యావంతులు, మేధావులు, ప్రజలు పెదవి విరుస్తున్నారు.అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేయాల్సిన వీటిని కాంగ్రెస్ మంత్రులు, వారి ఎమ్మెల్యేల నియోజకవర్గాలకే పరిమితం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 11 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
వీటిలో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆందోల్, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతిని ధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు కాగా, శుక్రవా రం ఈ స్కూల్స్‌కు మంత్రులు శంకుస్థాపన చేశా రు. ఒక్కో స్కూల్‌ను సుమారుగా 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించారు. ఈ స్కూల్స్‌లో 5 నుంచి 12వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమంలో బోధన చేస్తా రు. ఇందులో విద్యార్థులు, ఉపాధ్యాయులకు పూర్తిస్థాయిలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తారు.
వెలుతురు వచ్చేలా భవనాలు నిర్మిస్తారు. తరగతి గదులు, ల్యాబరేటరీలు, కంప్యూటర్, ఆడిటోరి యం, వసతి గృహం, డైనింగ్, కిచెన్, బహుళ వినియోగ హాళ్లు, సిబ్బందికి నివాసగృహాలు, క్లబ్‌లు, వైద్యశాల, ఇండోర్ స్పోర్స్, మైదానాలు తదితర సౌకర్యాలు కల్పించేలా డిజైన్ రూపొందించారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన వాటిని వచ్చే ఏడాది దసరా పండుగ వరకు పూర్తిచేసేలా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో హుస్నాబాద్, ఆందోల్, నారాయణఖేడ్, మెదక్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటీవల పటాన్చెరు ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. మిగతా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల, అభివృద్ధి పనుల మంజూరు చేయడంలో వివక్ష చూపుతున్నది. ఏడాది నుంచి జిల్లాలో ఇదే తంతు కొనసాగుతున్నది. అన్ని నియోజకవర్గాలను సమానంగా చూడాల్సిన ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. కేవలం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మం తుల నియోజకవర్గాలకే యంగ్ ఇండియా స్కూ ల్స్ మంజూరు చేసింది. మిగతా నియోజకవర్గాలకు మొండి చెయ్యి చూపింది. దీంతో ప్రభుత్వ తీరుపై అన్నివర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు నాణ్యమైన, కార్పొరేట్ స్థాయిలో విద్య అందించేందుకు గురుకులాలను నిర్మించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తీసుకుంటున్న నిర్ణయాలతో గురుకులాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నది. ప్రభుత్వం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయ డం మంచిదే. కానీ, ఇప్పటికే మండలాల్లో ఉన్న గురుకులాలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు సం గతి ఏమిటి, వీటిపై ఒక స్పష్టతను ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది.
అన్నివర్గాల వారికి అక్కడ సీట్లు దొరికేవి. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూ ల్స్‌లో అందరికీ విద్య దొరుకుతుందా..? అనే ప్రశ్న విద్యావేత్తల నుంచి వ్యక్తమవుతున్నది. ఈ ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. భవిష్యత్తులో వీటి పరిస్థితి ఏమిటో తెలియడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాలను, కేజీబీవీలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది నాణ్యమైన విద్యను అందించింది. ఇందులో చదివిన విద్యార్థులు అద్భుతంగా రాణించారు.
కేసీఆర్ అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తూ గురుకులాలు మంజూరు చేశారు. అభివృద్ధి పనులు మంజూరు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి తిలోదకాలు ఇస్తున్నది మనఊరు-మనబడి కార్యక్రమం కింద బీఆర్ఎస్ ప్రభుత్వం పాఠశాలలను అభివృద్ధి చేసింది.ప్రతి మండలంలో మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించడంతో ఎంతోమంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీ తదితర వాటిలో సీట్లు సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను, మోడల్ స్కూల్స్‌ను నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతున్నది. పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా చేస్తున్నది.
విద్యాక్షేత్రంగా వర్ధిల్లుతున్న సిద్దిపేటలో యంగ్‌ఇండియా పాఠశాలను ఏర్పాటు చే యాలి. సిద్దిపేటను విస్మరించడం ప్రభుత్వానికి తగదు.సిద్దిపేటలో మెరుగైన విద్య అం దుబాటులో ఉండటంతో ఇక్కడ పాఠశాల ఏర్పాటుతో నిరుపేద, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు మేలు జరుగుతుంది. మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే పైలెట్ ప్రాజెక్టు కింద సెలక్ట్ చేయడం సరికాదు. ప్రభుత్వం పక్షపాత ధోరణిని వీడాలి.
– మేర్గు మహేశ్, విద్యార్థ్ధి నాయకుడు, సిద్దిపేట
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లోనే ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం తగదు. గజ్వే ల్ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వ ర్గాలకు చెందిన విద్యార్థుల కోసం గత ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను తీసుకొచ్చింది. వాటికి సొంత భవనాలను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేయా లి. వేలాది మంది విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో గజ్వేల్ ప్రాంతంలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటున్నారు. వీరిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి.
-పి.శివకుమార్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేయడం హర్షణీయం. నర్సాపూర్ నియోజకవర్గం జాబితాలో లేకపోవ డం దురదృష్టకరం. నియోజకవర్గాల ఎం పిక ఏ విధంగా చేశారో అర్థం కావడం లేదు. విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటే నర్సాపూర్ నియోజకవర్గం ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం స్థలం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు నిర్ణయంచలేదో అర్థమవుతలేదు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం బలోపేతం చేయాలి.
– గుండం మోహన్‌రెడ్డి, విశ్రాంత హెచ్ఎం, నర్సాపూర్
దుబ్బాక అంటే ఉద్యమాలతో పా టు విద్యకు ప్రత్యేకత ఉంది. ప్రభు త్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరులో దుబ్బా క విస్మరించడం తగదు. సీఎం, మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే తొలి దశలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. దుబ్బాక నియోజకవర్గ విద్యార్థులపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడం సబబు కాదు.
– నక్క పరశురాములు, రిటెర్డ్ టీచర్, దుబ్బాక
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పైలెట్ ప్రాజెక్టు కు మెదక్ జిల్లాను విస్మరించడం బాధాకరం. సువిశాల ప్రాంగణం లో అన్ని వసతులతో ఉండే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ జిల్లా లో ఏర్పాటు చేసి ఉంటే మారుమూల ప్రాంతాల బడు గు, బలహీన, మైనార్టీ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ప్రభుత్వం ఆలోచన చేయాలి. మెదక్ నియోజకవర్గానికి కేటాయించి న్యాయం చేయాలి.
– సంగమేశ్వర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు
విద్యావ్యవస్థను ప్రభుత్వాలు రాజకీయ కోణంలో చూడకూడదు. కొ న్ని నియోజకవర్గాల్లోనే యంగ్ ఇం డియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పా టు చేస్తే , మిగిలిన నియోజకవర్గాల విద్యార్థుల పరిస్థితి ఏమి టి. తొలి విడతలో దుబ్బాక నియోజకవర్గం లేకపోవ డం బాధాకరం. విద్యార్థుల భవిష్యత్‌పై ఓటు రాజకీయాలు చేయడం హేయనీయం. దుబ్బాక చైతన్యవంతమైన ప్రాంతం. అన్యాయాలను ఈ ప్రాంతం సహించదు.
– గుడూరి వెంకటయ్య, రిటైర్డ్ ఎంఈవో దుబ్బాక
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూ ల్స్ పైలెట్ ప్రాజెక్టు కింద మెదక్ ని యోజకవర్గాన్ని ఎంపిక చేస్తే బాగుండేది. ఈ ప్రాంతం చాలా వెనకబడింది. మెదక్ జిల్లాలో 40శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మెదక్‌లో నెలకొల్పితే పేద విద్యార్థులకు ఎంతో మేలు జరిగేది. ప్రభుత్వం ఆలోచన చేయాలి.
– మల్లారెడ్డి,పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మెదక్