రాయపోల్ : కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సిద్దిపేట జిల్లా ఏపీ డి సుదీర్ బాబు ( DRDA APD Sudeer Babu ) అన్నారు. శుక్రవారం రాయపోల్( Rayapol) మండల మహిళా సమైక్య భవనంలో నిర్వహించిన ఆధార్, ఐకేపీ కొనుగోలు శిక్షణలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే వారి కుటుంబాలు బాగుపడతాయన్నారు.
ప్రభుత్వం కల్పిస్తున్న ప్రభుత్వ పథకాలను స్వయం సహాయక సంఘ సభ్యులు సద్వినియోగం చేసుకునే విధంగా చూడాలని అన్నారు. అనంతరం ఉద్యమ ఆధార్ ప్రతి మహిళ చేయించుకునే విధంగా చూడాలని అన్నారు. ఉద్యమ ఆధార్ ద్వారా మహిళలకు బ్యాంకు ద్వారా సూక్ష్మ రుణాలు పొందడానికి ఉపయోగపడతాయని తెలిపారు.
వచ్చే యాసంగి కొనుగోలు కేంద్రాలను పటిష్టంగా నిర్వహించాలని గ్రామ సంఘం అధ్యక్షురాలకు వివోఏలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం, విద్యాసాగర్ , ఏపీ యాదగిరి, ఎమ్మెస్ ఎంఈ మేనేజర్ శిరీష, అసిస్టెంట్ మేనేజర్ రాజు, సీసీలు నాగరాజు, కుమారస్వామి, మండల సమాఖ్య అధ్యక్షురాలు కవిత, కార్యదర్శి సౌందర్య, గ్రామ సంఘ అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు.