పెద్దశంకరంపేట : పరిశ్రమలు స్థాపించేందుకు మహిళలు ముందుకు రావాలని డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్ అన్నారు. బుధవారం స్థానిక స్త్రీ శక్తి కార్యాలయంలో 13వ మహిళా సమైక్య వార్షికోత్సవ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మహిళలు పారిశ్రామిక వేత్తలుగా మారి ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకు లింకేజీ రుణాలు, స్త్రీనిధి రుణాలు, అందిస్తున్నామన్నారు. బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మహిళల కోసం 270 రకాల పరిశ్రమలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
జిల్లాలో మంజీరా మెదక్ కంపెనీగా పేరుపెట్టి పెద్ద కంపెనీలకు దీటుగా వారు తయారు చేసిన వస్తువులను అమేజాన్, ప్లిప్కార్డు, సంస్థల ద్వారా ఆన్లైన్లో విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం జాన్ కెన్నడీ, డీఎంజీ నాగరాజు, ఎపీఎం గోపాల్, మహిళా సమాక్య అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, సభ్యులు నవనీత, పద్మ, సవిత, లక్ష్మి, సీసీలు నిరంజన్, యోహన్, లక్ష్మణ్, వీవోఏలు కవిత, రమ, సాయిలు, తదితరులున్నారు.