e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 20, 2021
Home News Medak: మందుబాబులకు చేదువార్త.. ఆ మూడ్రోజులు వైన్స్, బార్లు బంద్

Medak: మందుబాబులకు చేదువార్త.. ఆ మూడ్రోజులు వైన్స్, బార్లు బంద్

మెదక్‌ : జిల్లాలో ప్రశాంత వాతావరణంలో గణేశ్‌ నిమజ్జనాన్నిజరిపేందుకు, శాంతి భద్రతలను కాపాడేందుకుగాను ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు మున్సిపల్‌ ప్రాంతాల్లో వైన్స్‌లు, బార్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలను మూసివేస్తున్నట్లు కలెక్టర్‌ హరీశ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా మెదక్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌ మున్సిపాలిటీ పరిధుల్లో ఈ నెల 20న ఉదయం 6 నుంచి 21న ఉదయం 6 గంటల వరకు మూసివేస్తున్నట్లు, కాగా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఈ నెల 22న ఉదయం 6 నుంచి 23న ఉదయం 6 గంటల వరకు మూసివేస్తున్నామని ఆయన తెలిపారు.

దుకాణాదారులు ఆదేశాలు ఉల్లంఘించి షాపులు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గణేష్‌ నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవడానికి పోలీసులకు, జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ప్రజలకు ఆయన సూచించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement