గుమ్మడిదల, అక్టోబర్ 30 : ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రముఖ ఆలయాలకు రెండేండ్లుగా పాలకవర్గం లేక ఆలయాల నిర్వహణ, అభివృద్ధి కుంటుపడుతోంది. ఏటా శ్రావణ, కార్తిక మాసాల్లో ప్రముఖ దేవాలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉం టుంది. దీంతో ఈవోలు, సిబ్బందితో దేవాలయాలను నిర్వహించడం కష్టంగా మారింది. ఒక్కో ఈవో మూడు, నాలుగు దేవాలయాలకు ఇన్చార్జిగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పూర్తిగా ఒక్కో ఆలయంపై దృష్టిపెట్టలేక పోతున్నారు. దీంతో పండుగలు, విశేష రోజుల్లో ఆలయానికి వచ్చే భక్తులకు సరైన సేవలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయాల్లో భక్తులు వేసిన కానుకలు, హుండీ ఆదాయంపై ఉన్న శ్రద్ధ ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై దేవాదాయ శాఖ దృష్టి సారించకపోవడంతో భక్తులు మండిపడుతున్నారు. రెండేండ్ల క్రితం బీఆర్ఎస్ పాలనలో ఆలయాల పాలకవర్గం పదవీ కాలం ముగిసిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ట్రస్ట్ బోర్డు ఏర్పాటవుతుందని ఎదురుచూశారు. ఇం తలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఎన్నికల అనంతరం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు నోటిఫికేషన్ రావడం తో జాప్యమైంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభు త్వం కొన్ని దేవాలయాలకు పాలకవర్గం ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చినా మధ్యలోనే ఆగిపోయాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటై ఏడాది కాబోతున్నది. ఇప్పటి వరకు ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ రాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇకనైనా ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు సంబంధిత అధికారులు, దేవాదాయ శాఖ మంత్రి చొరవ తీసుకుని వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని భక్తులు కోరుతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం, బీరంగూడ భ్రమరాంబ సహిత మల్లికార్జునస్వామి ఆలయం, రుద్రారంలోని గణేశ్ ఆలయం, కొమురవెల్లిలోని మల్లికార్జునస్వామి ఆలయం, ఝరాసంగంలోని సంగమేశ్వరస్వామి ఆలయం, హత్నూర మండలం శేర్ఖాన్పల్లిలోని పలుగు పోచమ్మ ఆలయంతోపాటు ఇతర ఆలయాలకు పాలకవర్గం లేకపోవడంతో ఆలయాల నిర్వహణ కష్టతరంగా మారిం ది. నవంబర్ 2 నుంచి కార్తిక మాసం ప్రారంభం కానుండడంతో భక్తుల తాకిడీ అధికంగా ఉంటుంది. భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, రుద్రాభిషేకాలు, సత్యనారాయణ వ్రతాలు మొద లు పూజాధికార్యాలు ఆచరిస్తారు. పాలకవర్గం ఉంటే భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయించే అవకాశం ఉంటుంది.