సివిల్ సప్లయ్ డీఎం హరీశ్
మిరుదొడ్డి, జూన్ 5 : రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని జిల్లా సివిల్ సప్లయ్ డీఎం హరీశ్ అన్నారు. ఆదివారం మిరుదొడ్డి మండలంలోని కొండాపూర్, అందె, అల్వాల గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బస్తాలు తరలించేందుకు లారీల కొరత లేకుండా పంపిస్తున్నామన్నారు.
రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో ఐకేపీ సీసీ బాల్రాజు, ఆయా గ్రామాల వీవో లీడర్లు పాల్గొన్నారు.