bc reservations | నర్సాపూర్, అక్టోబర్ 6: నర్సాపూర్ మండల పరిధిలోని మహమ్మదాబాద్ గ్రామ పంచాయతీలో 90 శాతం కంటే ఎక్కువ మంది గిరిజన (లంబాడా) ఓటర్లు ఉంటే స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వ్ చేయడం ఏంటని చిప్పల్ తుర్తి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ సంధ్యారాణి, ఛత్రునాయక్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 1 నుండి 2 శాతం కన్నా తక్కువ ఓటర్లు ఉన్న బీసీలకు రిజర్వు చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. మహమ్మదాబాద్ గ్రామపంచాయతీ ఎస్టీలకు రిజర్వు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నానని అన్నారు.
గతంలో చిప్పలుర్తి ఎంపీటీసీ, నర్సాపూర్ జడ్పీటీసీ, నర్సాపూర్ ఎంపీపీ, ఎస్టీలకు రిజర్వు చేయబడ్డాయని.. ఇప్పుడు వచ్చిన రిజర్వేషన్లతో ఎస్టీలు మూడు స్థానాలు కోల్పోతున్నారని గుర్తుచేశారు. నర్సాపూర్ నియోజకవర్గంలో 50 వేల కంటే ఎక్కువ జనాభా ఎస్టీలే ఉన్నారని గుర్తుచేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎస్టీలకు రిజర్వు చేయాలని సూచించారు.
BJP MP | వరద బాధితులకు సాయం చేస్తుండగా దాడి.. ఎంపీకి తీవ్ర గాయాలు
BC Reservations | బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
Gold Prices | బంగారం పరుగులు.. తులం రూ.1.23 లక్షలు