మిరుదొడ్డి, జూన్ 19 : కేసీఆర్ సార్ ఉన్నప్పుడు రైతులకు బాయిలకాడ 24 గంటలపాటు కరెంట్ ఇచ్చిండు. గా కరెంట్‌తో మంచిగా పంటలు పండించకున్నాం. గీ కాంగ్రెస్ ప్రభుత్వం అచ్చినంక సక్కగా కరెంట్ అత్తలేదు. యాసంగిలో కాంగ్రెస్ సర్కార్ సక్కగా కరెంట్ ఇయ్యకపోవడంతో వరి ఎండి పోయిం ది. మా రైతులకు కరెంట్ గోసలు తప్పవు ఇగా..
మిరుదొడ్డి, జూన్ 19 : గడికి గడికి కరెంట్ బంద్ చేయకుండా కాంగ్రెస్ సర్కారు కరెంట్ మంచిగా ఇయ్యాలే. గప్పుడూ కేసీఆర్ సార్ ఇండగా కన్ను ముసినంత సేపు కూడా కరెంట్ పోలేదు. సీఎం రేవంత్‌రెడ్డి రాంగనే ఈ ఎండాకాలంలో కరెంట్ ఇబ్బందులతో అంటు పంటలు ఎండి, ఇంటిలో ఉండలేని గతి పట్టింది. 10 ఏండ్ల పాటు కరెంట్ పోవడం చూడలేదు, గిప్పుడైతే ఎప్పుడు పోతుందో…ఎప్పుడూ…అత్తుందో తెలుత్తా లేదు. మల్లా కేసీఆర్ సార్ అత్తనే కరెంట్ కోతలు ఉండవు.
కొమురవెల్లి, జూన్ 19 : కరెంట్ ఎప్పుడు అత్తదో ఎప్పుడు పోతదో అస్సలు తెల్వడం లేదు. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం కరెంట్ అస్సలు పోనేపోలేదు. గిప్పుడు ఇంట్లో పనులు చేయాలనుకున్నప్పుడు సమయానికి కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నాం. ఒక్కగంటలో ఎన్నిసార్లు కరెంట్ పోతదో దేవుడికే తెలియాలి. గతంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరాయంగా వచ్చిన కరెంట్ ప్రభుత్వం మారగానే ఎందుకు పోతుందో పెద్దలకే తెలియాలి.
నారాయణరావుపేట, జూన్ 19: కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు 24 గంటలు కరెంటు వచ్చేది. అప్పుడు బాయిలకాడ బోరుమోటర్లు అస్సలు కాలిపోయేవి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంటు కరెంట్ ఎప్పుడు వస్తదో ఎప్పుడు పోతదో తెలియడం లేదు. లోవోల్టేజీతో మోటర్లు కాలిపోతుయి రైతులు అటు ఆర్థికంగాస ఇటు పంటలు సరిగా పండక నష్టపోతున్నారు. అప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుండే.
నారాయణరావుపేట, జూన్ 19 : నాకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24 గంటలు కరెంటు ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ ఇబ్బందులు తప్పడం లేదు. పంట పెట్టుబడి సాయం అందే పరిస్థితి లేదు. దీంతో రైతులంతా ఆగమవుతున్నారు. కనీసం ఈ వానకాలమైనా కరెంటు సక్కగా ఇవ్వాలి. రోజూ మెయింటెనెన్స్ పేరుతో గంటలకొద్దీ కరెంటు కట్ చేస్తున్నారు.
రాయపోల్, జూన్ 19 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా అయింది. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కరెంట్ సరఫరాలో అంతరాయం కలుగుతున్నది. చిన్నపాటి వర్షం, ఇదురుగాలులకు కరెంట్ తీస్తుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పంటలకు సైతం అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సరఫరాలో అంతరాయంతోపాటు సమయపాలన లేకుండా విద్యుత్ తీయడంతో అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. పదేండ్ల్ల కేసీఆర్ పాలనలో రెప్పపాటు కూడా కరెంట్ పోలేదు. ఇప్పుడు కరెంట్ ఎందుకు పోతుందని ప్రశ్నిస్తే అధికారుల నుంచి సమాధానం రావడం లేదు.
తెలంగాణ రాకముందు కరెంట్ కోసం నైట్ల బాయిలకాడనే ఉండేది..టిప్పుల చొప్పున కరెంట్ వచ్చేది. పొద్దుగాల నాలుగు గంటల కరెంట్, నైట్ మూడు గంటల కరెంట్ ఇచ్చేది. వచ్చిన కరెంట్ కూడా లోడ్ ఆగకుండా పోతుండే. మస్తు మాట్ల కరెంట్ కట్ అవుతుండే ఎవుసం చేయడానికి మస్తు ఇబ్బందులు పడ్డం. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ పుణ్యమా అని ఇరువై నాలుగు గంటల కరెంట్ వచ్చింది. అప్పుడు కరెంట్ కోసం ఎదురుసూసుడు లేదు. పొద్దునదాక కరెంట్ ఉంటంది ఎవుసం మంచిగ చేసుకుంటున్నం. అప్పటిలెక్కనే కరెంట్ ఉంటే ఎవ్వలూ ఎవు సం సెయ్యకపోతురు. మళ్లీ కాంగ్రెస్ వచ్చే పాతరోజులు దాపురించే&
రాయపోల్, జూన్ 19 : వ్యవసాయానికి 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ను అందించిన ఘనత తెలంగాణ తొలిసీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. తెలంగాణ ఉద్యమమే విద్యుత్‌తోపాటు నిళ్లు, నిధులు, నియామకాలతో జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ విద్యుత్‌ను 24 గంటలపాటు అందించి దేశంలోనే చరిత్ర సృష్టించారు. గతంలో విద్యుత్ ఎప్పుడు వస్తుం దో..ఎప్పుడు పోతుంతో తెలియని పరిస్థితి ఉండేది. కేసీఆర్ హయాంలో వ్యవసాయనికి నిరంతర విద్యుత్ అందించి, రైతులను రాజుగా మార్చారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వెనుకటి రోజులే వచ్చాయి. నాణ్యమైన విద్యుత్ రాక రైతులు అవస్థలు పడుతున్నారు.