సంక్షేమం కావాలంటే మళ్లీ బీఆర్ఎస్ రావాలి
అవ్వా పింఛన్ వస్తుందా.. ఆరోగ్యం ఎలా ఉంది.. అక్కా కారుకు ఓటేసి మల్లొక్క పారి కేసీఆర్ సారును గెలిపియ్యాలే అంటూ అందోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ, చిరు వ్యాపారులు ప్రజలతో ముచ్చటించారు.
- సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సంక్షేమ పాలన
- అందోల్ బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్
- అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ ప్రచారం
- నేరడిగుంట చౌరస్తాలో చిరు వ్యాపారుల కష్ట సుఖాలు తెలుసుకున్న ఎమ్మెల్యే
- కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలంటూ విజ్ఞప్తి
- ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు
అందోల్, నవంబర్ 1: అవ్వా పింఛన్ వస్తుందా.. ఆరోగ్యం ఎలా ఉంది.. అక్కా కారుకు ఓటేసి మల్లొక్క పారి కేసీఆర్ సారును గెలిపియ్యాలే అంటూ అందోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ, చిరు వ్యాపారులు ప్రజలతో ముచ్చటించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, నియోజకవర్గంలో చేపిట్టిన పనులు, చేపట్టాల్సిన పనులను వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మండలంలోని నేరడిగుంట-బ్రాహ్మణపల్లి చౌరస్తాలో బుధవారం సాయంత్రం ప్రచారం నిర్వహించిన క్రాంతికిరణ్ జనంతో మమేకమై ప్రచారాన్ని కొనసాగించారు. ఎమ్మెల్యే మాటాముచ్చటకు స్థానికులు సంబురపడ్డారు. స్థానిక గ్రామాల ప్రజలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై డప్పు చప్పుళ్లు, డీజే పాటలకు అనుగుణంగా తీన్మార్ స్టెపులేశారు. సంతలో చేపల ధరను అడిగి తెలుసుకోవడంతో పాటు చేపలు తూకం వేశారు. ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమంకోసం ఎంతో కృషి చేస్తున్నదని, గ్రామాలోని చెరువుల్లో చేపలు పుష్కలంగా లభిస్తున్నాయన్నారు. అందరూ బాగుండాలన్నా, ప్రభుత్వ పథకాలు యథావిధిగా కొనసాగాలన్నా, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి. కేసీఆర్ సీఎం కావాలని అందుకోసం ఈనెల 30 జరుగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మోసపోయి గోస పడ్తామని, ప్రజలు ఆలోచించి ఓటేయాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ జైపాల్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్‌రెడ్డి, ఎంపీపీ బాలయ్య, ఎంపీటీసీ కృష్ణాగౌడ్, సర్పంచ్‌లు లింగాగౌడ్, ప్రవీణ్‌రెడ్డి, నాయకులు పత్తి వీరేశం, భూమయ్య, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష
అల్లాదుర్గం, నవంబర్ 1: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ణాటకలా కరెంట్ గోసపడాల్సిందేనని, ప్రజలారా మీ ఓటు రైతుబంధుకు వేస్తారో లేదా రాబంధులకు వేస్తారో ఆలోచించండని అందోల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని అప్పాజిపల్లి, కాయిదంపల్లి, అల్లాదుర్గం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ కల్లబొల్లి మాటలు నమ్మొదని, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే తన ధ్యేయమని, కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా పథకాలు అమలు చేస్తామన్నారు.
బీఆర్ఎస్లోకి చేరికలు..
అల్లాదుర్గం మండలంలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో భాగంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. చౌటకూర్ మండలం సరాఫ్పల్లి, అల్లాదుర్గం మండలం కాయిదంపల్లికి చెందిన పలువురు నాయకులు, క్యాకర్తలు మహిళలు బీఆర్ఎస్లో చేరగా, వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనిల్‌కుమార్‌రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ కాశీనాథ్, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహులు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు అంజియాదవ్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు దశరథ్, కాయిదంపల్లి సర్పంచ్ బేతయ్య, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు బ్రహ్మం, బీఆర్ఎస్ నాయకులు రామాగౌడ్, పవన్, వరప్రసాద్, సాయికుమార్, ఆశయ్య, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

