పేదల సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమని, ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం చేగుంట మండలంలో బోనాల్, పులిమామిడి, కిష్టాపూర్, ఇబ్రహీంపూర్ గ్రామాల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇతర పార్టీల నేతలు చెప్పే మాటలు నమ్మవద్దని, బీఆర్ఎస్ పార్టీని మరోసారి దీవించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజలకు మాయమాటలు చెప్పి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజలు మరోసారి మోస పోవద్దని, అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్కు పట్టంకట్టి, కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు.
చేగుంట, అక్టోబర్ 26: పేదల సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని, ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని మెదక్ పార్లమెంట్ సభ్యుడు, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం చేగుంట మండలంలో బోనాల్, పులిమామిడి, కిష్టాపూర్, ఇబ్రహీంపూర్ గ్రామాల్లో ప్రభాకర్‌రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇతర పార్టీల నాయకులు చెప్పే మాటలు నమ్మవద్దని, బీఆర్ఎస్ పార్టీని మరోసారి దీవించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికలు వచ్చిన సందర్భంగా అనేక పార్టీల నాయకులు రకరకాల హామీలు ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉన్నదన్నారు. ముడేండ్ల కిందట ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసి గెలిచిన బీజీపీ ఎమ్మెల్యే రఘునంధన్‌రావు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజలు మరోసారి మోసపోవద్దని, అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్కు పట్టంకట్టి, కారు గుర్తుకు ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పలు గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎంపీ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచిక్ల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రజనక్ ప్రవీన్‌కుమార్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు రంగయ్యగారి రాజిరెడ్డి, ఇబ్రహీంపూర్, బోనాల్, పులిమామిడి కిష్టాపూర్, రుక్మాపూర్ సర్పంచ్‌లు దొరగొల్ల రాములు, బాలమలయ్య, గొర్రె రేణుకారమేశ్, బస్కి స్వప్నాఅంజిరెడ్డి, ఎంపీటీసీలు నవీన్, గాండ్ల లతానందం, హోళియనాయక్, బింగి గణేశ్, మెతుకు శ్రీను, సర్పంచులు కుమ్మరి శ్రీనివాస్, ఊరడి మహిపాల్, సొసైటీ చైర్మన్లు వంటరి కొండల్‌రెడ్డి, మ్యాకల పరమేశ్, వైస్ చైర్మన్ తానీషా, తీగుల్ల అంజనేయులు, మాజీ చైర్మన్ కోమండ్ల నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్‌లు నాయిని రాజ్‌గోపాల్, మ్యాకల వెంకటస్వామి, నాయకులు లచ్చిరెడ్డి, బాపురెడ్డి, ఎగ్గడి శేఖర్, రమేశ్తదితరులున్నారు.