సిద్దిపేట, మార్చి 22: మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పి.వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మచ్చ వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు నిమ్మ రజనీకాంత్‌రెడ్డి, సీనియర్ నాయకులు ఎల్ల్లారెడ్డి, మేర్గు మహేశ్, యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రెడ్డి యాదగిరితో కలిసి విలేకరులతో మాట్లాడారు. మెదక్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్కు కంచుకోట అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు చేసిన అభివృద్ధి పనులే పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాయన్నారు. ఏకకాలంలో రూ. 2లక్షల పంట రుణమాఫీ, రైతుబంధు రూ.15వేలు పెంపు వంటి హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కారు మోసం చేస్తున్నదని విమర్శించారు. వెంకట్రామిరెడ్డికి మెదక్ జిల్లా ప్రజలతో ఎంతో అనుబంధం ఉందని, ఆయనను అభ్యర్థిగా ప్రకటించినందుకు కేసీఆర్, హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు శ్రావణ్, శ్యాం, రవితేజ పాల్గొన్నారు.