ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులు, పెద్ద పెద్ద వడగండ్లు ప్రజలను వణికించాయి. మంగళవారం రాత్రి మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అకాల వర్షం పడి జనజీవనాన్ని ఆగంచేసింది. మరికొద్ది రోజుల్లో చేతికి అందుతాయనే వేళ పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ప్రకృతి కన్నెర్ర జేసి పంటంతా నాశనం చేయడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. మామిడి కాయలు నేలరాలగా..చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
రైతులను ఆదుకుంటాం
* మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
పాపన్నపేట/ నిజాంపేట, ఏప్రిల్ 26 : ఈదురు గాలులతో పాటు వడగండ్ల వానతో దెబ్బతిన్న వరి పంటలను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ రమేశ్ బుధవారం పరిశీలించారు. పాపన్నపేట మండలం లక్ష్మీనగర్‌లో వరి పంటలను పరిశీలించి రైతులను ఓదార్చారు. ప్రభుత్వం అదుకుంటుందని, తక్షణ సాయం గా సీఎం కేసీఆర్ రైతులకు పంట నష్టపరిహారం అందజేస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతుబంధు మండలా ధ్యక్షుడు సోములు, ఏడుపాయల చైర్మన్ బాలాగౌడ్, బీఆర్ఎస్ మండలా ధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్ కుమ్మరి జగన్, మా ర్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ అనురాధాఏడుకొండలు, నాయకులు మధుసూధన్‌రెడ్డి, మనోహర్ ఉన్నారు. నిజాంపేటలో దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు. రైతులు అధైర్యపడొద్దని ఆదుకుంటామ ని భరోసాఇచ్చారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్‌లు కవిత, చంద్ర వర్ధిని, అనిల్‌కుమార్, అరుణ్‌కుమార్, ఎంపీటీసీలు ఉన్నారు.
పంటనష్టం వివరాలు సేకరించాలి
* జిల్లా వ్యవసాయాధికారి ఆశాకుమారి
హవేళీఘనపూర్, ఏప్రిల్ 26 : వర్షాలతో పంట నష్టపోయిన రైతుల వివరాలు పకడ్బందీగా సేకరించి అందజేయాలని జిల్లా వ్యవసాయాధికారి ఆశాకుమారి అన్నారు. మండలంలోని ఫరీద్పూర్ గ్రామంలో బుధవారం వరి పంటలను పరిశీలించారు. మండలవ్యాప్తంగా ఎంత మంది రైతులు, ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అనే వివరాలను అందజేయాలని ఏవో నాగమాధురిని ఆదేశించారు. కార్యక్రమంలో ఏవో నాగమాధురి, ఏఈవో భార్గవ్, రైతులు బాబు పాల్గొన్నారు.
మామిడి, పండ్ల తోటలకు తీవ్ర నష్టం
* జిల్లా ఉద్యానవనశాఖాధికారి నర్సయ్య
శివ్వంపేట, ఏప్రిల్ 26 : మండలంలోని వర్షానికి, ఈదురుగాలులకు దెబ్బతిన్న మామిడి, ఇతర పండ్ల తోటలను బుధవా రం ఉద్యాన వనశాఖ అధికారులు పరిశీలించారు. ఉసిరికపల్లి, శివ్వంపేట, అల్లీపూర్ గ్రామాల్లో మామిడి తోటలను జిల్లా ఉద్యా నవనశాఖ అధికారి నర్సయ్య, ఏవో లావణ్య పరిశీలించారు. అదేవిధంగా పంటలు నష్టపోయిన రైతుల వివరాలు సేకరించా రు. మొత్తం 64 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు మౌనిక, రవివర్మ తదితరులు ఉన్నారు.
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం
మెదక్ రూరల్, ఏప్రిల్ 26: ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇవ్వాలనే లక్ష్యంతోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. మెదక్ మండలం పాతూరులో ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని బుధవారం తహసీల్దార్ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తూకాల్లో మోసాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర
చిన్నశంకరంపేట, ఏప్రిల్ 26 : మండలంలోని మడూరులో మడూరు పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఏవో శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తెచ్చేటప్పుడు పొల్లు, తాలు లేకుండా చూడాలన్నారు. వర్షాలు పడే అవకాశం ఉంద ని, టార్పాలిన్లు వెంట తెచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సిద్ధిరాములు, వార్డు సభ్యులు లక్ష్మణ్, రాజు, డాక్టర్ లింగాగౌడ్, నాయకులు స్వామి, శంకర్‌గౌడ్, శేఖర్ ఉన్నారు.