విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూస్తాం
వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని, భూగ ర్భ జలాలు తగ్గడంతోనే సమస్యలు వస్తున్నాయని రామాయంపేట ట్రాన్స్‌కో ఏడీఈ సుధాకర్ అన్నారు. సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘కరెంట్ ట్రిప్‌తో కాలుతున్న మోటర్లు’..
- రామాయంపేట విద్యుత్ ఏడీఈ సుధాకర్
రామాయంపేట రూరల్, మార్చి 12: వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని, భూగ ర్భ జలాలు తగ్గడంతోనే సమస్యలు వస్తున్నాయని రామాయంపేట ట్రాన్స్‌కో ఏడీఈ సుధాకర్ అన్నారు. సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘కరెంట్ ట్రిప్‌తో కాలుతున్న మోటర్లు’.. అనే శీర్షికకు స్పందించిన విద్యుత్ అధికారులు మంగళవారం రామాయంపేట మండలం కోనాపూర్ గిరిజన పెద్ద తండాను సందర్శించారు.
గిరిజన రైతుల పంట పొలాలను పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులు గిరిజన రైతులతో మాట్లాడారు. కొద్ది రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో భూగర్భ జలాలు అడుగంటి మోటర్లు కాలిపోవడంతోపాటు బోరుబావుల మోటర్ల నుంచి నీరు సరిగ్గా పైకి రాకపోవడంతోనే సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు.ఇప్పటి వరకైతే విద్యుత్ సమస్యలు తమ దృష్టికి రాలేదని తెలిపారు. ఎక్కడైనా విద్యుత్ సమస్యలు ఉంటే తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని అధికారులు భరోసా ఇచ్చారు. ఏడీఈ వెంట ఏఈ పెంట్యా నాయక్, లైన్మెన్ రాజు, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీశైలం తదితరులు ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

