Mamidi Anjaiah | చిగురుమామిడి, అక్టోబర్ 29 : చిగురుమామిడి మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వం తరఫున నిర్వహించే కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ సమావేశాలుగా చిత్రీకరించే ప్రయత్నం కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని, దానికి అధికారులే బాధ్యత వహించాలని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లోనూ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఎలాంటి పదవులు లేకున్నా రైతు వేదికలో వేదికపై కూర్చుంటూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్నారు.
తహసీల్దార్ పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత ..
తహసీల్దార్‌కు ప్రభుత్వ కార్యక్రమంలో అనర్హులను వేదికపై కూర్చోబెట్టడం ఎంతవరకు సమంజసమని మామిడి అంజయ్య ప్రశ్నించారు. తహసీల్దార్ పనితీరుపై ఇప్పటికే మండల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని అన్నారు. 420 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ హామీని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని అన్నారు.
కల్యాణ లక్ష్మి పథకంలో భాగంగా తులం బంగారం ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదని, అబద్దాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు గట్టి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అంజయ్య పేర్కొన్నారు.
Landslides | భారీ వర్షానికి శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు.. ట్రాఫిక్‌కు అంతరాయం
Suicide: భార్యతో వీడియో కాల్లో మాట్లాడుతూ.. సౌదీలో ఆత్మహత్య చేసుకున్న భర్త
Jaanvi Swarup | హీరోయిన్గా మహేష్ బాబు మేనకోడలు..సంతోషం వ్యక్తం చేసిన మంజుల