పటాన్చెరు, సెప్టెంబర్ 20: క్రీడలను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన సంగారెడ్డి జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన విద్యార్థుల మార్చ్ ఫాస్ట్‌ను ఎమ్మెల్యే స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచేలా బీఆర్ఎస్ ప్రభుత్వం కార్యాచరణ అమలుచేస్తున్నదన్నారు.
నియోజకవర్గంలో క్రీడాకారులు రాష్ట్ర, దేశస్థాయికి ఎదగాలనే లక్ష్యంతో ఐదు మండలాల్లో మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామన్నారు. క్రీడల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా ప్రోత్సహిస్తామన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. పటాన్‌చెరులోని మైత్రి మైదానాన్ని రూ.7కోట్ల నిధులతో తీర్చిదిద్దామన్నారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, ఎంపీపీలు సుష్మాశ్రీ వేణుగోపాల్‌రెడ్డి, దేవానందం, ప్రవీణ విజయ్‌భాస్కర్‌రెడ్డి, జడ్పీటీసీలు సుప్రజా వెంకట్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, కుమార్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్లు పాండురంగారెడ్డి, రోజాబాల్రెడ్డి, లలితా సోమిరెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్‌యాదవ్, పుష్పా నగేశ్‌యాదవ్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్‌గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, యాదగిరి యాదవ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, దశరథరెడ్డి, వెంకటేశ్‌గౌడ్, అఫ్జల్, ఎస్జీఎఫ్ సెక్రటరీ అమూల్య, సీఐ లాలు నాయక్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.