పుల్కల్, జూలై 5: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టు నుంచి ఆదివారం దిగువకు నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు డీఈ నాగరాజు తెలిపారు. హైదరాబాద్,సంగారెడ్డి ప్రాంతాలకు తాగునీటి అవసరాల నిమిత్తం 0.1టీంఎంసీలు(347 కూసెక్కులు) నీటిని వదులుతున్నట్లు తెలిపారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.91 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 4.5 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. నీటి విడుదల నేపథ్యంలో మంజీరా నది పరీవాహక ప్రాంతం వైపు ప్రజలు, జాలరులు, పశువుల కాపరులు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.