నాగల్గిద్ద, ఆగస్టు 1 : సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలంలోని ఖూభా తండా పం చాయతీలో తీవ్ర నీటి సమస్య ఏర్పడింది. ఈ తండాలో 500 జనాభా నివసిస్తున్నా రు. నీటి సమస్య తీర్చడానికి పంచాయతీ నుంచి ట్యాంకర్ ఏర్పాటు చేసి నీరందిస్తున్నా అవి సరిపోవడం లేదని గిరిజనులు తెలిపారు. తాగునీటి కోసం వ్యవసాయ బావుల వద్దకు కిలోమీటర్ల మేర వెళ్లి తెచ్చుకుంటున్నారు. మహిళలు కొండలు, కోనలు దాటి బిందెల ద్వారా తాగునీటిని తెచ్చుకోవడానికి అవస్థలు పడుతున్నారు. కొంతమంది ద్విచక్ర వాహనాలపై, ఆటోల మీద వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. పదిహేను రోజులుగ మిషన్ భగీరథ నీరు రావడం లేదన్నారు. చేతిపంపులు మరమ్మతులు చే యకపోవడంతో అవి నిరుపయోగంగా మా రి మూలన పడ్డాయని తండాలువాసులు తెలిపారు. అధికారులు స్పందించి తండా లో నీటి సమస్యను పరిష్కరించాలి.
మా తండాలో తీవ్ర నీ టి ఎద్దడి నెలకొంది. తాగునీరు, ఇతర అవసరాలకు గ్రామంలో చుక్కనీరు లేదు. ఉద యం, సాయంత్రం బిందెలు పట్టుకుని రెండు మూడు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వ్యవసాయ బావులు వద్దకెళ్లి నీరు తెచ్చుకోవాల్సి పరిస్థితి ఉంది. మిష న్ భగీరథ నీరు ఎప్పుడు వస్త్తదో తెలియడం లేదు. అధికారులు స్పందించి మా తండాలో నీటి సమస్యను పరిష్కరించాలి.
– లక్ష్మీబాయి, గిరిజన మహిళ, ఖూభాతండా