దోమలపెంట, జనవరి 13 : శ్రీశై లం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం లో ఒకటో యూనిట్ వద్ద జీరో ఫ్లోర్లో డ్రాఫ్ట్ ట్యూబ్ స్లాబ్ లీకేజీని వెంటనే అరికట్టాలని జెన్కో సీఎండీ సందీప్‌కుమార్ సుల్తానియా ఆదేశించారు. అవసరమైతే నిపుణులను సంప్రదించాలని సూచించారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేం ద్రాన్ని ఆయన సందర్శించారు. సీఎండీ కి చీఫ్ ఇంజినీర్ రామసుబ్బారెడ్డి, ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు.
విద్యుత్కేంద్రంలో ఉన్న అన్ని యూనిట్ల గురిం చి అడిగి తెలుసుకొన్నారు. అనంతరం మెయిన్ పవర్‌హౌస్‌లోని కాన్ఫరెన్స్ హా ల్లో అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 4వ యూనిట్‌ను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. స్లాబ్ లీకేజీపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం అసిస్టెంట్ ఇం జినీర్స్ అసోసియేషన్ నాయకులు సీఎండీని కలిసి మూడు నెలల కిందట 204 మందికి అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్లుగా ప్రమోషన్లు ఇచ్చారని, ఇంత వరకు పోస్టింగ్స్ ఇవ్వలేదని విన్నవించారు.
అలాగే ఎనిమిదేండ్ల నుంచి ఇంజినీర్లకు ఎటువంటి సాధారణ బదిలీలు జరగలేదని, త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జెన్కో హైడల్ డైరెక్టర్ సచ్చిదనందం, ఎస్ఈలు అధినారాయణ, రవింద్రకుమర్, డీఈ లు, ఏడీఈలు, ఏఈలు, వోయండ్, ఆర్టిజన్ కార్మికులు, ఫైర్ సిబ్బంది, ఎస్పీఫ్ సిబ్బంది పాల్గొన్నారు.