హుస్నాబాద్‌టౌన్, మే 18: బండి సంజయ్‌ని బర్తరఫ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ డిమాండ్ చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా సతీశ్‌కుమార్ మాట్లాడుతూ బండిని బర్తరఫ్ చేసి బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమా లేక బీజేపీ ప్రభుత్వమా అనే విషయంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఇది హనీట్రాప్ కాదని, కేవలం కేసు నుంచి తప్పించుకునేందుకు బండి సంజయ్ బాలికపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. దాదాపు అరగంటకు పైగా అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఒకదశలో పోలీసులు బీఆర్ఎస్ నాయకులను రాస్తారోకో నుంచి తప్పించేందుకు ప్రయత్నం చేయగా నాయకులు నినాదాలు చేయడంతో పోలీసులు వెనక్కి తగ్గారు.
అనంతరం బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో విరమించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షులు వంగ వెంకట్రామిరెడ్డి, పెసరు సాంబరాజు, మాజీ ఎంపీపీలు భూక్యా మంగ, మాలోతు లక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు తిరుపతిరెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బండి రమణారెడ్డి, ఎండీ అన్వర్, బి.వెంకన్న, హరీశ్, భాగ్యారెడ్డి, బొల్లి శ్రీనివాస్, వాల సుప్రజ, మడప ప్రభాకర్‌రెడ్డి, మేకల వికాసాయాదవ్, ఎడబోయిన రజినీ, చిత్తారి శ్రీనివాస్, కన్నోజు రామకృష్ణ, సూరంపల్లి పరశురాములు పాల్గొన్నారు.