ప్రపంచానికి మెదక్ చరిత్ర తెలియజేస్తా
ప్రపంచానికి మెదక్ చరిత్ర తెలియజేస్తానని ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు అన్నారు. మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపు మేరకు శనివారం మెదక్‌లోని ఖిల్లాను, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చిని ఆయన సందర్శించారు. ఏడుపాయల ఆలయాన్ని సందర్శించి, వనదుర్గమ్మకు పూజలు చేశారు.
- ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్‌లకు ప్లాన్ చేస్తా
- సినీ నటుడు మంచు విష్ణు వెల్లడి
- మెదక్ చర్చి, ఖిల్లా, ఏడుపాయల ఆలయం సందర్శన
మెదక్ అర్బన్/పాపన్నపేట, జూలై 18 : ప్రపంచానికి మెదక్ చరిత్ర తెలియజేస్తానని ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు అన్నారు. మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపు మేరకు శనివారం మెదక్‌లోని ఖిల్లాను, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చిని ఆయన సందర్శించారు. ఏడుపాయల ఆలయాన్ని సందర్శించి, వనదుర్గమ్మకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ చరిత్ర తెలిపేందుకు పర్యాటకశాఖ కృషి చేస్తున్నదన్నారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న మెదక్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలన్నారు.
మెదక్ జిల్లాలో ఇలాంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని తనకు తెలియదన్నారు. ఈ ప్రాంతంలో సినిమా షూటింగులు చేసేందుకు ప్లాన్ చేస్తామని, పర్యాటక కేంద్రాల్లో వసతులు కల్పించాలని అధికారులను ఆయన కోరారు. మెదక్ పట్టణంలోని చర్చిలో మంచు విష్ణు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏడుపాయల ఆలయ పరిసరాలు సినిమా షూటింగ్‌లకు స్పాట్‌గా మారే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడుపాయల ప్రకృతి సౌందర్యానికి, ఆధ్యాత్మికతకు నిలయం అన్నారు. జిల్లాలోని ఏడుపాయల ఆలయం, మెదక్ చర్చి, ఖిల్లా, పోచారం అభయారణ్యాన్ని కలుపుతూ టూరిజం స్పాట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆయన వెంట మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్, అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

