మద్దూరు(ధూళిమిట్ట), ఆగస్టు 31: వానొచ్చిందంటే..ఆ ఊరిలోని రోడ్డు వెంబడి ఇం డ్లన్నీ నీటమునగాల్సిందే..! ఇండ్లలోకి చేరిన వర్షపునీటితో కొన్నేండ్లుగా పలు కుటుంబా లు ఇబ్బందులు పడుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని కమలాయపల్లి మెయిన్ రోడ్డు పక్కన ఉన్న ఇండ్లలోకి వర్షపు నీరు చేరుతున్నది.
వర్షపునీరు చేరడం వల్ల ఇంట్లోని సామగ్రి పూర్తిగా తడిసిముద్ధవుతున్నది. అర్జున్పట్ల-దానంపల్లి గ్రామాల మధ్య గతంలో నిర్మించిన బీటీ రో డ్డు నిర్మాణం వల్ల రోడ్డు పక్కన ఉన్న ఇండ్లన్నీ కిందికయ్యాయి. దీంతో వర్షం వస్తే చాలు రోడ్డు వెంబడి వరదనీరంతా రోడ్డు పక్కన ఉన్న ఇండ్లలోకి చేరుకుంటున్నది. వర్షపు నీరు ఇండ్లలోకి చేరడం వల్ల పలు పెంకుటిండ్లు ఇప్పటికే నేల మట్టమయ్యాయి. వర్షపునీటి వల్ల పాఠశాల కాంపౌండ్ కూడా కూలిపోయింది.
తరుచూ ఇండ్లలోకి నీరు చేరడం వల్ల నిరుపేదలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవనం కొనసాగించాల్సిన దుస్థితి నెలకొన్నది. బీటీ రోడ్డు వెంబడి సైడ్ డ్రైన్ నిర్మిస్తే సమస్య పరిష్కారమవుతుంది. రోడ్డుకు దిగువన ఉన్న ఇండ్లను తొలిగించి కొత్త ఇండ్లు ని ర్మించాల్సిన అవసరం ఉన్నది.సమస్యను పరిష్కరించాలని ఇటీవల గ్రామాన్ని సందర్శించి న మంత్రి సీతక్క దృష్టికి తీసుకువెళ్లినా ఫలి తం లేదని పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.