బెజ్జంకి, జూన్ 18: సిద్దిపేట జిల్లా మండల కేంద్రం బెజ్జంకి నుంచి బేగంపేట వర కు నిర్మిస్తున్న తారు రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరుతూ బేగంపేట గ్రామస్తులు బుధవారం గ్రామంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ చింతలపల్లి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణ పనుల జాప్యంతో కంకర తేలి, బురద గుంతలు, దుమ్ము, ధూళితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తున్నదని, చాలాచోట్ల రోడ్డు దెబ్బతిని ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, శేఖర్‌బాబు, నరేశ్, మోహన్‌రెడ్డి, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్, సంపత్, రవి, వెంకట్, మల్లయ్య, కనకయ్య, మధు, చంద్రం, లింగయ్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.